
క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు కూడా మొబైల్ ఫోన్ అనేది విపరీతంగా ఉపయోగిస్తున్నారు. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు కూడా ఈ మొబైల్ ఫోన్లను వాడుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశం, విదేశాలలో కూడా ఏం జరుగుతుందో క్షణాల్లోనే ఈ మొబైల్ ఫోన్లలోని సోషల్ మీడియా యాప్స్ ద్వారా తెలుసుకుంటున్నాం. దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో పంచాయితీ ఎన్నికలవేళ కొంతమంది రాజకీయ నాయకులు వినూత్న రీతిలో ప్రచారాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. తరాలు మారుతున్నాయి. ప్రతి ఒక్కరి తలరాతలు మార్చే ప్రచార వేదికలు కూడా మెల్లిమెల్లిగా మారుతూనే ఉన్నాయి.
Read also : తుఫాన్ ఎఫెక్ట్… రికార్డ్ స్థాయిలో వర్షపాతం, నీటమునిగిన నెల్లూరు!
ఇక తాజాగా ప్రతి ఒక్కరి చేతుల్లోనూ స్మార్ట్ఫోన్ ఉండడంతో.. ఆయా పంచాయతీ అభ్యర్థులందరూ కూడా ఈ మొబైల్ ఫోన్లోనే ప్రచారం చేసేలా ప్రయోగాలు చేస్తున్నారు. మొన్నటి వరకు ఇళ్లకు వెళ్లి మాకు ఓట్లు వేయండి అని అడగడం, గోడలకు పోస్టర్లు అంటించడం లేదా మైకులు పట్టుకుని కార్యక్రమాలు నిర్వహించేవారు. కానీ ప్రస్తుత రోజుల్లో మాత్రం వాటికి భిన్నంగా ఈ సోషల్ మీడియా అనేది మారిపోయింది. ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్ ఉండడంతో వారి నెంబర్లు అన్నిటిని కూడా ఒక వాట్సాప్ గ్రూప్ లో యాడ్ చేసుకుని వారికి వివిధ రకాల డిస్కషన్స్ పేరిట పోల్స్ ఏర్పాటుచేసి వాటి రిజల్ట్ ని బట్టి రాజకీయ నాయకుల అభ్యర్థుల పనితీరును మార్చుకుంటున్నారు. గ్రూపులో నడిచేటువంటి డిస్కషన్స్ ద్వారానే ఇచ్చేటువంటి హామీలు అలాగే వ్యూహాలు అప్పటికప్పుడు మార్చుకుంటున్నారు. ఇక ఈ రోజుల్లో సోషల్ మీడియా అనే వేదికలు రాజకీయ నాయకులకు కూడా బాగానే ఉపయోగపడుతున్నాయి.
Read also : ఇలా రేట్లు పెంచే.. ఐ బొమ్మ రవి లాంటి వారిని పుట్టిస్తున్నారు : సిపిఐ నారాయణ





