
క్రైమ్ మిర్రర్, మహాదేవ్ పూర్:-స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం పక్కా వ్యూహంతో ముందుకెళుతోంది. ఓవైపు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రత్యేక జీవో జారీ చేసేందుకు కసరత్తు కొనసాగిస్తూనే.. మరోవైపు ఎన్నికల నిర్వహణకు అవసరమైన వివరాల సేకరణ, సన్నాహాలు ముమ్మరం చేసింది. జిల్లాలో 241 సర్పంచ్, 2012 వార్డులతో పాటు 12 ఎంపీటీసీ జడ్పిటిసి స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే ప్రత్యేక జీవోను శుక్రవారం విడుదల చేసింది. ఈనెల ఆఖరి వారంలో స్థానిక ఎన్నికల షెడ్యూల్, నోటిఫికేషన్‌లు వెలువడనున్నట్టు సమాచారం. గ్రామ, మండల, జడ్పీటీసీల వారీగా పోలింగ్, కౌంటింగ్ కేంద్రాల వివరాలను కూడా సిద్ధం చేస్తోంది. ఆయా కేంద్రాలకు అవసరమైన రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, సామగ్రి, యంత్రాంగానికి సంబంధించిన వివరాల సేకరణ కూడా ఇప్పటికే పూర్తయింది. ఎన్నికలకు షెడ్యూల్ విడుదలై, నామినేషన్ల ప్రక్రియ పూర్తయ్యాక, ఖరారైన అభ్యర్థులను బట్టి వారికి కేటాయించిన గుర్తుల ప్రకారం బ్యాలెట్ పత్రాలను ముద్రించనున్నారు. వీటిని కూడా మండల, జిల్లాల వారీగా అందుబాటులో ఉన్నచోట ముద్రించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తంగా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న స్థానిక సమరానికి ఎట్టకేలకు రంగం సిద్ధమైంది.
Read also : ట్రంప్ వల్లే యుద్ధం ఆగిపోయింది.. శాంతికి మారుపేరు ట్రంప్ : పాకిస్తాన్ ప్రధాని
Read also : ఏకాత్మ మానవవాద సిద్ధాంతకారుడు దీన్ దయాళ్