
-
క్లౌడ్ బరస్ట్‌తో జమ్మూ ఉక్కిరిబిక్కిరి
-
జమ్మూకశ్మీర్, హిమాచల్, పంజాబ్, హర్యానాకు రెడ్ అలర్ట్
-
ఏపీలో మరో మూడు రోజులపాటు వర్షాలు
-
ఉత్తరకోస్తా ప్రధాన పోర్టుల్లో మూడో ప్రమాద హెచ్చరిక
-
ఏపీలో ఆరు జిల్లాలకు ఆరెంజ్, రెండు జిల్లాలకు ఎల్లో అలర్ట్
క్రైమ్‌మిర్రర్, నిఘా: ఉత్తర భారతంలో వర్షాలు దంచికొడుతున్నాయి. కుండపోత వర్షాలతో జమ్మూకశ్మీర్ అతలాకుతలమవుతోంది. ప్రఖ్యాత పుణ్యక్షేత్రం వైష్ణోదేవి యాత్రకు తీవ్ర ఆటంకం కలిగింది. వైష్ణోదేవి ఆలయానికి వెళ్లే మార్గంలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఆకస్మిక వరదలతో పలువురి ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. కొండ చరియలు విరిగిపడటం వల్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో అధికారులు సహాయ చ్యలు ముమ్మరం చేశారు. జమ్మూలో పరిస్థితిని సీఎం ఒమర్ అబ్దుల్లా సమీక్షించారు. పరిస్థితులను పర్యవేక్షించేందుకు శ్రీనగర్ నుంచి జమ్మూకు వెళ్తున్నట్లు ఆయన ట్వీట్ చేశారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు యంత్రాంగం సిద్ధంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు.
తావి, రావి నదులు ప్రమాదస్థాయిని మించి ప్రవహిస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. కథువా జిల్లాలో రావి నది ఉప్పొంగుతోంది. దీంతో లోతట్లు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. శ్రీనగర్- జమ్మూ రహదారిని, శ్రీనగర్-లేహ్ హైవేను తాత్కాలికంగా బంద్ చేశారు. జమ్మూలో మరికొన్ని రోజుల పాటు భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసింది.చింది.
ఆంధ్రప్రదేశ్‌లో మూడురోజుల దంచికొట్టనున్న వానలు
ఏపీలో మూడురోజుల పాటు భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర కోస్తాలోని ప్రధాన పోర్టుల్లో మూడో నెంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఏపీలోని ఆరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, అల్లూరి జిల్లా, కాకినాడలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు తెలిపింది. అలాగే తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. అల్పపీడనం ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా ఉండటంతో కాకినాడ జిల్లా ఉప్పాడలో తీర ప్రాంతం కోతకు గురైంది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు.
Read Also:
- కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా : బండి సంజయ్
- భారీ వర్షాలు.. అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలి : హోంమంత్రి