ప్రస్తుత రోజుల్లో శీతల పానీయాలు తాగడం ఫ్యాషన్ గా మారిపోయింది. కానీ ఈ కూల్ డ్రింక్స్ ఎంత ప్రమాదం అనేది ఎవరికీ కూడా సరిగా తెలియదు. ఇక తాజాగా ఈ సీతల పానీయాలు తాగడం వల్ల ఎంత ప్రమాదమో వైద్యులు చెప్పుకొచ్చారు. ప్రతిరోజు కూడా కూల్ డ్రింక్స్ తాగడం వల్ల మనిషి ఆరోగ్యానికి ఎంత ప్రమాదకరమో వైద్యులు చెప్పిన దాన్ని బట్టి చూస్తే కచ్చితంగా ఆశ్చర్య పోవాల్సిందే. ఎందుకంటే ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా కూల్ డ్రింక్స్ కి అలవాటు పడ్డారు.
ఛాంపియన్స్ ట్రోఫీకి బుమ్రా కష్టమే!..
మనము ఏ సీజన్లో అయినా సరే కూల్ డ్రింక్స్ అధికంగా తీసుకోవడం వల్ల అధిక బరువుతో పాటు షుగర్ వస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా శరీరంలో కొలెస్ట్రాల్ మరియు బీపీ పెరిగి గుండె జబ్బులు వస్తాయని తెలిపారు. ఈ కూల్ డ్రింక్స్ వల్లే దాదాపుగా 2020 వ సంవత్సరంలో 3,40,000 మంది చనిపోయారని వైద్యులు తెలిపారు.
సమంతకు మరో వ్యాధి!… చాలా ఫన్నీగా ఉందంటూ ట్వీట్?
ఎక్కువగా చదువుకున్న వారు అలాగే పట్టణాల్లో నివసించే వారు మాత్రమే ఈ కూల్డ్రింక్స్ అధిక మొత్తంలో వినియోగిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఫంక్షన్స్ సమయంలో లేదా ఆనందం సమయంలో ఈ సీతల పానీయాలకు అలవాటు పడిపోయి అవే ఎక్కువ మోతాదులు తీసుకుంటున్నారు. కాబట్టి ఎవరూ కూడా శీతల పానీయాలు తాగకుండా ఎక్కువ మొత్తంలో నీరుని తాగండి అని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఏది ఏమైనా సరే ఈ కూల్డ్రింక్స్ వల్ల ఎంత ప్రమాదకరమో ఈ విషయం ద్వారా మనకు అర్థమయ్యే ఉంటుంది. కాబట్టి కూల్ డ్రింక్స్ బదులు నీటిని ఎక్కువగా సేవించాలని డాక్టర్లు తెలిపారు.