క్రైమ్

నా జోలికొస్తే నరికేస్తా, టౌన్‌ప్లానింగ్‌ సిబ్బందికి బెదిరింపులు

  • బంజారాహిల్స్‌లో కత్తితో ఓ వ్యక్తి వీరంగం

  • ఇంటి ప్రహరీ విషయంలో తగాదా

  • రహదారికి అడ్డంగా ప్రహరీ నిర్మిస్తున్నట్లు ఆరోపణలు

  • కొలతలు తీసేందుకు వెళ్లిన టౌన్‌ ప్లానింగ్‌ సిబ్బంది

  • కారులో నుంచి కత్తి తీసి బెదిరించిన యజమాని

  • నిందితుడిని అదుపులోకి తీసుకున్న ఫిల్మ్‌నగర్‌ పోలీసులు

క్రైమ్‌ మిర్రర్‌, హైదరాబాద్‌: బంజారాహిల్స్‌లో ఓ ఇంటి యజమాని వీరంగం సృష్టించాడు. ఇంటి ప్రహరీ విషయంలో ఫిర్యాదులు రావడంతో కొలతల కోసం వెళ్లిన టౌన్‌ ప్లానింగ్‌ సిబ్బందిపై కత్తితో దాడి చేసేందుకు యత్నించాడు. పట్టణ ప్రణాళిక అధికారులను అడ్డుకున్నాడు. అతని కారులోనుంచి కత్తి బయటకు తీసి హల్‌చల్‌ చేశాడు. తన ఇంటి నిర్మాణం విషయంలో జోక్యం చేసుకుంటే నరికి పారేస్తానని బెదిరించాడు. దీంతో టౌన్‌ప్లానింగ్‌ సిబ్బంది పోలీసులను ఆశ్రయించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 12లో ఓ వ్యక్తి ఇంటిని నిర్మించుకున్నారు. ఆ ఇంటి ప్రహరీ రోడ్డుపైకి రావడంతో స్థానికుల నుంచి సర్కిల్‌ 18 టౌన్‌ ప్లానింగ్‌ విభాగానికి ఫిర్యాదులు వచ్చాయి. దీంతో కొలతలు తీసుకునేందుకు సిబ్బంది అక్కడకు వెళ్లారు. ఈ క్రమంలో ఆ ఇంటి యజమానికి దాడికి యత్నించారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. కాగా, జీహెచ్‌ఎంసీ పరిధిలో అక్రమ నిర్మాణాల విషయంలో అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు.

Read Also: 

  1. బీసీ రిజర్వేషన్లపై ప్రజలను కాంగ్రెస్ మోసం చేస్తోంది: కిషన్‌రెడ్డి
  2. హస్తినలో సీఎం రేవంత్ ఫుల్ బిజీ, కేబినెట్ భేటీ వాయిదా
Back to top button