
రామకృష్ణాపూర్,క్రైమ్ మిర్రర్:- సంక్రాంతి పండుగ సందర్భంగా సెలవులను పురస్కరించుకొని ఇళ్లకు తాళం వేసి వెళ్లే ప్రజలు దొంగతనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్సై భూమేష్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. దొంగతనాల నియంత్రణకు పోలీస్ శాఖ అన్ని చర్యలు చేపట్టిందని, పట్టణంలో సిబ్బంది నిత్యం గస్తీ నిర్వహిస్తున్నారని చెప్పారు.అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్ 100కు సమాచారం ఇవ్వాలని సూచించారు. విలువైన వస్తువులను బ్యాంక్ లాకర్లలో భద్రపరచడం, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం, తాళం వేసి వెళ్లే ముందు పోలీసులకు సమాచారం ఇవ్వడం వంటి జాగ్రత్తలు పాటించాలని తెలిపారు.
Read also : సినిమాటోగ్రఫీ శాఖలో ఏం జరుగుతోంది?
Read also : రైతు భరోసా అప్డేట్: జనవరి 26 నుండి భూమి లేని రైతు కూలీలకు కూడా..!





