
క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- హైదరాబాద్ సీపీ సజ్జనార్ మద్యం మత్తులో జలసాలు చేసే వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. మద్యం మత్తులో వాహనాలు నడపడం వారికి ప్రమాదమే కాకుండా ఇతరులకు కూడా ప్రమాదమే అని అన్నారు. ఇలాంటి వారందరూ కూడా టెర్రరిస్టులు, మానవ బాంబులు కాక ఇంకేమవుతారు?.. అని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. మీ సరదాల కోసం, జల్సాల కోసం ఇతరుల ప్రాణాలు తీసే హక్కు మీకు ఎవరు ఇచ్చారు?.. అని ప్రశ్నించారు. మీ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఎవరైనా సరే ఇలా మద్యం మత్తులో జలషాలు చేస్తూ ఇతరులను ఇబ్బంది పెడితే వెంటనే వారిపై పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు మాకెందుకులేని వదిలేస్తే వారి వల్ల వేరే ఎవరికైనా ప్రాణం నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయని స్పష్టం చేశారు. కాబట్టి ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే ప్రతి ఒక్క మనిషి కూడా మారాలి అని… అప్పుడు ఈ సమాజం కూడా మెరుగు అవుతుంది అని అన్నారు. ప్రతి ఒక్క మనిషి కూడా బాధ్యతగా వ్యవహరించాలి అని.. మీరు జలసాలకు అలవాటు పడి ఇతరుల ప్రాణాలకు నష్టం కలిగిస్తే మాత్రం ఇకపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. తాజాగా కర్నూల్ లో బస్సు అగ్నిప్రమాదం గురవడానికి మద్యం మత్తులో బైక్ నడిపిన యువకుడు కావడం పట్ల ఆ వీడియోలను షేర్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా సజ్జనార్ కీలక సూచనలు చేశారు.
Read also : తుఫాన్ తీవ్రతను బట్టి విద్యాసంస్థలకు సెలవులు ఇవ్వండి : సీఎం
Read also : పదేళ్లలో రాష్ట్రాన్ని మొత్తం దోచేసుకున్నారు : కోమటిరెడ్డి





