
క్రైమ్ మిర్రర్, తెలంగాణ :- తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే తాజాగా మాజీ మంత్రి హరీష్ రావు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పై తీవ్రంగా మండిపడ్డారు. భారీ వర్షాలు ఉంటాయని సమాచారం అందినా కూడా ప్రభుత్వం ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించిందని.. ప్రజలకు ముందస్తు చర్యలు, హెచ్చరికలు ఎందుకు జారీ చేయలేదు అని అన్నారు. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం వల్లనే MGBS లో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయని హరీష్ రావు రేవంత్ రెడ్డి పై ఫైరయ్యారు. ఇది ఒక క్రిమినల్ నిలిజెన్స్. నేడు ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే పండుగ వేళ కూడా చాలామంది సొంత గ్రామాలకు వెళ్ళలేక చాలానే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని క్రియేట్ చేశారు. MGBS లో నేడు ప్రయాణికుల పరిస్థితి చాలా భయంగా ఉందని.. రాత్రిపూటైతే ప్రయాణికులు పడి కాపులు కాస్తూ ఉన్నారని అన్నారు. కాస్త మీ బురద రాజకీయాలు పక్కన పెట్టేసి వరదలో చిక్కుకున్న వారిని కాపాడడం, ప్రజలకు మంచి చేయడం ప్రారంభించండి రేవంత్ రెడ్డి అని హరీష్ రావు సోషల్ మీడియా వేదికగా ట్విట్ చేశారు. ప్రస్తుతం హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా.. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న జనసేన నాయకులు మరియు శ్రేణులకు వరదలో చెక్కుకున్న ప్రజలకు సహాయం చేస్తూ ప్రజలకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండం గా మారడంతో రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి.
Read also : వరద బాధితులకు జనసేన నాయకులు అండగా నిలబడండి : పవన్ కళ్యాణ్
Read also : భారత్ కు పరుగుల “అభిషేకం”… పాకిస్తాన్ కు చుక్కలే!