Tuesday, March 17, 2026
Homeసినిమాఇది వాళ్ళ వ్యక్తిగత విషయం.. విజయ్,త్రిష పై వస్తున్న రూమర్స్ ను తిప్పి కొట్టిన ఖుష్బూ

ఇది వాళ్ళ వ్యక్తిగత విషయం.. విజయ్,త్రిష పై వస్తున్న రూమర్స్ ను తిప్పి కొట్టిన ఖుష్బూ

క్రైమ్ మిర్రర్,సినిమా:- తమిళ స్టార్ హీరో విజయ్ మరియు త్రిష మధ్య వస్తున్న రూమర్స్ పై తాజాగా స్టార్ నటి కుష్బూ స్పందిస్తూ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో ప్రతిరోజు కూడా ఎన్నో వార్తలు వస్తూ ఉంటాయి కానీ వాటిని నమ్మితే అంతే సంగతి అని అన్నారు. విజయ్ మరియు త్రిష నాకు ఎప్పటినుంచో తెలుసు అని.. ఇది వారి వ్యక్తిగత విషయమని అన్నారు. మరి ముఖ్యంగా నాకు త్రిష ఒక మంచి స్నేహితురాలు.. నాకు తెలిసిన ఎంతోమంది మహిళల్లో త్రిష చాలా మంచి మనిషని అన్నారు. కానీ ప్రతిరోజు కూడా కొంతమంది వీళ్ళిద్దరిని టార్గెట్ చేసి పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాబట్టి ప్రతి విషయంలోనూ ఇరువైపులా ఆలోచిస్తేనే మనకు నిజ నిజాలు ఏంటో తెలుస్తాయి అని అన్నారు. కాగా విజయ్ మరియు తన భార్య విడాకులు విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తుంది. ఒకవైపు విజయ్ రాజకీయాల్లో బిజీబిజీగా గడుపుతుండగా వ్యక్తిగతంగా మాత్రం విజయ్ మరియు త్రిష మధ్య ఏదో ఉంది అంటూ సోషల్ మీడియా వేదికగా పుకార్లు వస్తున్నాయి. ఈ విషయంపైనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో భాగంగా కుష్బూ వ్యాఖ్యానిస్తూ సమాధానం తెలియజేశారు.

చౌటుప్పల్ మైనార్టీ గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్

పంటలు కోతకొచ్చిన రైతుబంధుపై స్పష్టత లేదు : కేటీఆర్

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది.పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments