
చండూరు,క్రైమ్ మిర్రర్:- జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యూహాత్మకంగా ముందుకు సాగనున్నట్లు విశ్వసనీయ సమాచారం. సర్పంచ్ ఎన్నికల్లో బిఆర్ఎస్ అభ్యర్థులు అనుకున్న దానికంటే ఎక్కువగా గెలుపొందడం స్థానికంగా చర్చినీయంశంగా మారింది. గుర్తులేని ఎన్నికల్లోనే ఇలా ఉంటే మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ గుర్తులు ఉంటాయి…. కాబట్టి పరిస్థితులు ఎలా ఉంటాయనేది అందరూ మాట్లాడుకుంటున్నారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు ప్రాంత అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నప్పటికీ బిఆర్ఎస్ ను పూర్తిస్థాయిలో బీట్ చేయలేకపోయారనే వాదనలు గట్టిగా వినబడుతున్నాయి. దీని కారణం కాంగ్రెస్ క్యాడర్లో సమన్వయం లోపించడం ప్రధాన కారణంగా అంతా అనుకుంటున్నారు. ఎమ్మెల్యే మంచోడే కానీ ఆయన వెంట ఉండే క్యాడరే కరెక్ట్ కాదని క్షేత్రస్థాయిలో పక్కాగా ముందుకు పోయి పనిచేసేవారు లేరని కేవలం ఆయన పక్కకు ఉండి ఫోటోలు దిగడానికే సరిపోతారని ముచ్చట మాత్రం నియోజకవర్గంలో చెక్కర్లు కొడుతుంది. ఈ క్రమంలో మున్సిపల్ ఎన్నికల్లో వూహాత్మకంగా ముందుకు పోవాల్సిన అవసరం ఏర్పడింది. బాధ్యతలు అప్పగించే విషయంలో చాలా నిర్ణయాత్మకంగా ముందుకు వెళ్తున్నారని టాక్ నడుస్తుంది. మునుగోడు నియోజకవర్గంలో చండూరు,చౌటుప్పల రెండు మున్సిపాలిటీలు ఉన్నాయి. ఈ రెండు మున్సిపాలిటీలను క్లీన్ షిప్ చేసి తనంటే ఏంటో నిరూపించాలని ఎమ్మెల్యే భావిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. దీంతో మున్సిపల్ ఎన్నికల్లో క్యాడర్ మార్పుతో పాటు అనూహ్యంగా ఆఖరి క్షణంలో అనుకోని వ్యక్తులు కూడా బరిలో ఉండే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.
Read also : Donald Trump: మళ్లీ టారిఫ్ లు పెంచుతాం, భారత్ కు ట్రంప్ హెచ్చరిక!
Read also : Yogi Meets Modi: మోడీని కలిసిన యోగీ.. మ్యాటర్ ఏంటంటే?





