
క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్ :- వెస్టిండీస్ డేంజరస్ ఆల్ రౌండర్ ఆండ్రీ రస్సెల్ ఇటీవల ఐపీఎల్ కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం ప్రతి ఒక్కరకీ తెలిసిందే. ఆ తరువాత కోల్కతా జట్టుకు సపోర్టింగ్ స్టాఫ్ లో చేరనున్నట్లు రస్సెల్ ప్రకటించారు. అయితే తాజాగా ఐపీఎల్ కు గుడ్ బై చెప్పడానికి గల కారణాన్ని ఎటకేలకు బయటకు తెలిపాడు. ప్రపంచంలోనే అతిపెద్ద లీగ్ ఐపీఎల్. అలాంటి ఐపీఎల్ లో ప్రయాణాలు చేయడం, వరుస మ్యాచ్లు ఆడడం, ప్రాక్టీస్ చేయడం, జిమ్ అలాగే వర్క్ లోడ్ వంటివి శరీరంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయని అన్నారు. కొద్ది రోజుల్లోనే ఇవన్నీ బ్యాలెన్స్ చేయడం అనేది సవాలుతో కూడుకున్న విషయమని పేర్కొన్నారు. ఒక బ్యాటర్ గానే కాకుండా బౌలింగ్ లోను ఎక్కువగా ప్రభావం చూపాల్సి వస్తుంది అని.. కేవలం ఇంపాక్ట్ ప్లేయర్ గా కొనసాగాలని అనుకోవడం లేదు అని ఈ డేంజరస్ ఆటగాడు తెలిపారు. కాగా ఐపీఎల్ లో గత కొన్ని సంవత్సరాలుగా కోల్కత్తా జట్టులో డేంజరస్ ఆటగాడిగా ఎన్నో మ్యాచ్లను ఒంటి చేతితో గెలిపించిన సందర్భాలను ఎన్నో సార్లు చూసుంటాం. అలాంటి ఆటగాడు ఐపీఎల్ కు గుడ్ బై చెప్పడం అనేది అభిమానులకు తీవ్ర నిరాశ కలిగించింది.
Read also : Habits: ఈ అలవాట్లు ఉంటే త్వరగా మార్చుకోండి.. లేకపోతే నష్టపోయేది మీరే!
Read also : ఏసీబీ వలలో చండూరు డిప్యూటీ తహసిల్దార్ చంద్రశేఖర్





