క్రీడలువైరల్

మా జట్టు నూతన దళపతి ఇతడే : రాజస్థాన్ రాయల్స్

క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్ :-
ఐపీఎల్ చరిత్రలో మొట్టమొదటి ట్రోఫీని అందుకున్నటువంటి రాజస్థాన్ రాయల్స్ జట్టు తాజాగా జరిగిన మినీ వేలంలో కీలక ప్లేయర్లను తీసుకుంది. మొన్నటి వరకు రాజస్థాన్ రాయల్స్ జట్టుకు కెప్టెన్ గా ఉన్నటువంటి సంజు సాంసన్ ట్రేడింగ్ ద్వారా చెన్నై జట్టుకు వెళ్లగా ఆ జుట్టునుంచి స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాను రాజస్థాన్ తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇక రాజస్థాన్ రాయల్స్ జట్టుకు నూతన కెప్టెన్ ఎవరు అనేది ప్రతి ఒక్కరు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తుండగా తాజాగా ఈ జట్టు కెప్టెన్ గా జడేజా దాదాపు ఖరారు అయినట్లుగా తెలుస్తోంది. రవీంద్ర జడేజా ఫోటోను రాజస్థాన్ రాయల్స్ జట్టు సోషల్ మీడియా వేదికగా ఎడిట్ చేసి షేర్ చేస్తూ “దళపతి సూన్” అంటూ క్యాప్షన్ ఇచ్చారు.

Read also : ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో.. హిందూ కెప్టెన్ మాకొద్దు అంటున్న బంగ్లాదేశ్ అభిమానులు?

కాబట్టి రాజస్థాన్ రాయల్స్ జట్టుకు దాదాపు రవీంద్ర జడేజానే కెప్టెన్గా వ్యవహరిస్తారు అని స్పష్టంగా అర్థమవుతుంది. నిన్న మొన్నటి వరకు ఈ జట్టు కెప్టెన్ గా యంగ్ ప్లేయర్స్ జైష్వాల్ అలాగే రియాన్ పరాగ్ పేర్లు వినిపించాయి. కానీ రవీంద్ర జడేజాకు ఉన్నంత అనుభవం ఆ జట్టులో ఇంకెవరికి లేకపోవడంతో ఫ్రాంచైజీ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. దీంతో చెన్నై నుంచి రాజస్థాన్ జట్టుకు వచ్చినటువంటి రవీంద్ర జడేజా అభిమానులు నిరాశలో ఉన్నా కూడా కెప్టెన్ గా అయినా నిలబెడితే ఫ్యాన్స్ కు అంతకు మించిన సంతోషం ఉండదు. ఈ నేపథ్యంలోనే రవీంద్ర జడేజా అభిమానులు అందరూ కూడా రాజస్థాన్ జట్టుకు జడేజానే కెప్టెన్గా చేయాలి అని సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. మరి అధికారికంగా ప్రకటించే వరకు తప్పక వెయిట్ చేయాల్సిందే.

Read also : రోజా VS జనసేన అభిమానులు.. సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండింగ్?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button