తెలంగాణ

ఇది స్వర్ణగిరి కాదు… స్వర్గం..ఏ మాయ గోవిందా!

క్రైమ్ మిర్రర్, తెలంగాణ న్యూస్ :- గోవిందా.. గోవిందా.. ఈ పేరు వినగానే మొదటిగా ప్రతి ఒక్కరికి గుర్తుకు వచ్చేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతిలో ఉన్న శ్రీ కలియుగ వెంకటేశ్వర స్వామి. సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై తన భక్తులను ఎల్లవేళలా కాపాడుకుంటూ ఉంటాడు. ఇక ఆ తరువాత తెలంగాణలో స్వర్ణ గిరి టెంపుల్ ఎంత ఫేమస్ ప్రతి ఒక్కరికి తెలిసిందే. ప్రతి ఒక్కరు కూడా “ఇది స్వర్ణ గిరి కాదు మరో సప్తగిరి” అని అంటూ ఉంటారు. ఈ గుడికి వెళితే స్వర్గంలో ఉన్నట్లుగా ప్రతి ఒక్కరు కూడా భావిస్తూ ఉంటారు. ఇక్కడ స్వామి 16 అడుగులతో… పసిడి కాంతులతో… అభయ-వరద ముద్రలతో కొలువై దర్శనమిస్తున్న క్షేత్రమే ఈ స్వర్ణ గిరి. సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి సప్తగిరి దాటి… ఈ స్వర్ణ గిరిలో కొలువుదీరాడు అని భక్తులకు అనిపించేలా ఆయన రూపం, ఎంతో ఆహ్లాదకరంగా చూడడానికి చూడముచ్చటగా కనిపించే ఈ దేవాలయం… ఈ రెండు కూడా ప్రతి ఒక్కరికి ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది.

ఒక మాటలో చెప్పాలంటే ఈ స్వర్ణ గిరి టెంపుల్ తెలంగాణలోనే ఒక మైమరిపించేటువంటి, భక్తుల ఆత్మవిశ్వాసాన్ని, కోరిన కోరికలను తీర్చేటువంటి మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఈ స్వర్ణ గిరి టెంపుల్.. అలా వైకుంఠ అన్ని పోలిన నిర్మాణంతో.. 22 ఎకరాల్లో కట్టిన అద్భుతమైన దేవాలయం. స్వర్ణ గిరి అనే పేరుకు తగ్గట్టుగా ఇక్కడ కొలువై ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఎందుకు తగ్గట్టుగానే స్వర్ణమయ కాంతులతో విరజల్లుతూ భక్తులకు దర్శనమిస్తూ ఉంటాడు. గుడిలోకి వెళితే అడుగడుగునా కూడా ఆధ్యాత్మికత ఉట్టిపడుతూ… ప్రతి ఒక్క భక్తుడిని కూడా కట్టుకునేలా ఉంటుంది. అసలు ఈ ఆలయం ఎక్కడ ఉంది అని అనుకుంటున్నారా?… ఈ స్వర్ణ గిరి దేవాలయం తెలంగాణ లోని భువనగిరి జిల్లా శివారులోని మానేపల్లి కొండల పైన ఉంటుంది. ఈ గుడికి ప్రతిరోజు కూడా కొన్ని వేల మంది భక్తులు తరలివస్తూ ఉంటారు.

ఖర్గే సమావేశానికి కోమటిరెడ్డి డుమ్మా.. కాంగ్రెస్ నుంచి జంపేనా?

హైదరాబాద్ లో బంగారం ధర, ఇవాళ ఎంత పలుకుతుందంటే?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button