క్రీడలువైరల్

BCCI పవర్ ఏంటో తెలిపే న్యూస్ ఇది!.. క్రైమ్ మిర్రర్ స్పెషల్ న్యూస్!

క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్ :- బీసీసీఐ… “భారత క్రికెట్ నియంత్రణ మండలి”. క్రికెట్ తెలిసిన ప్రతి ఒక్కరికి కూడా బీసీసీఐ అంటే ఏంటో కూడా తెలుసు. ఇండియాలో క్రికెట్ ను నియంత్రించే స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ బీసీసీఐ. ప్రపంచంలోని ప్రతి దేశానికి కూడా ఒక క్రికెట్ బోర్డు అనేది ఉంటుంది. అలాగే మన భారతదేశానికి క్రికెట్ బోర్డ్ పేరు బీసీసీఐ. దేశం కోసం ఆడేటువంటి ప్లేయర్ల జాబితా, ఆ క్రికెట్ ప్లేయర్ల బాగోగులను మొత్తం కూడా చూసుకునేదే ఈ క్రికెట్. ప్రస్తుతం ప్రపంచంలోనే మన భారతదేశ క్రికెట్ బోర్డ్ బీసీసీఐ అత్యంత సంపన్నమైన క్రీడా సంస్థగా నిలిచింది. ఎందుకంటే ప్రపంచ దేశాలతో పోలిస్తే భారతదేశంలో క్రికెట్ కు ప్రాధాన్యత అనేది చాలా ఎక్కువగా ఉంది. మిగతా దేశాల్లో ఫుట్బాల్ కు ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది. కానీ మనదేశంలో కేవలం క్రికెట్ క్రీడకు మాత్రమే ప్రాధాన్యత సంతరించుకుంది.

Read also : పాకిస్తాన్ లో మరో విషాదం.. క్రికెట్ ఆడుతుండగా బాంబు పేలుడు?.. ఒకరు మృతి!

ఒకప్పుడు క్రికెట్ మ్యాచ్లు నిర్వహించేందుకు బీసీసీఐ చాలా కష్టపడింది. కానీ ప్రస్తుత రోజుల్లో బీసీసీఐ ఇదే క్రికెట్ తో ఎన్నో కోట్ల సంపదను సృష్టించింది. గడిచిన ఐదేళ్ల కాలంలో బీసీసీఐ సంపద విపరీతంగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలోనే బీసీసీఐ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. తాజా నివేదికల ప్రకారం… బీసీసీఐ బ్యాంక్ బ్యాలెన్స్ 20 వేలకోట్లు పైమాటే. 2019వ సంవత్సర సమయంలో బీసీసీఐ బ్యాంక్ బ్యాలెన్స్ 6059 కోట్లు. కానీ 2025వ సంవత్సరానికి వచ్చేసరికి బీసీసీఐ బ్యాంకు బ్యాలెన్స్ ఏకంగా 20 వేల 686 కోట్లు. అంటే గడిచిన 5 ఏళ్లకాలంలో బీసీసీఐ ఏకంగా 14,627 కోట్లు సంపాదించింది. దీంతో బీసీసీఐ ఎంత పవర్ ఫుల్ అనేది ఇప్పుడు అర్థమవుతుంది. ప్రపంచ లోని అన్ని క్రీడా సంస్థలతో పోలిస్తే.. భారత క్రికెట్ బోర్డ్ అనేది చాలా ఆర్థిక శక్తివంతంగా కనిపిస్తుంది. బీసీసీఐ ఇంత సంపాదిస్తున్న విషయం తెలుసుకున్న అభిమానులు.. ఒకింత షాక్ అవుతున్నా… ప్రపంచ దేశాలన్నిటిలోకల్లా భారత్ క్రికెట్ బోర్డ్ ఎక్కువ సంపాదిస్తుందటంలో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Read also : మతసామరస్యం వెలసిన ఘటన.. గణేష్ లడ్డు దక్కించుకున్న ముస్లిం మహిళ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button