క్రైమ్ మిర్రర్, జాతీయం :- మిడిల్ ఈస్ట్ లో జరుగుతున్న యుద్ధాల గురించి తాజాగా జరిగిన టీవీ9 సమిట్ లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్క దేశం పైన యుద్ధ ప్రభావం పడింది అని.. అన్ని దేశాలు కూడా ఉక్కిరిబిక్కిరి అవుతున్న మన భారతదేశం మాత్రం ప్రశాంతంగా ఉంది అని అన్నారు. భారత్ ఏ సవాళ్లకు భయపడే దేశం కాదు అని.. ఎన్ని సవాళ్లు, ఎన్ని కష్టాలు వచ్చినా ముందుండి ధైర్యంగా ఎదుర్కొంటుందని అన్నారు. ప్రపంచంలోని అన్ని దేశాలపై అలాగే అన్ని రంగాలపై యుద్ధ ప్రభావం పడింది. యుద్ధ పరిస్థితులను మన భారతదేశం ఎలా ఎదుర్కొంటుంది అనే తీరును ప్రపంచ దేశాలు అనుసరిస్తున్నాయి అని వ్యాఖ్యానించారు. కచ్చితంగా మాకు దేశ ప్రయోజనాలు ముఖ్యమని.. శాంతి చర్చలను భారత్ఎప్పుడు కూడా స్వాగతిస్తుంది అని తెలిపారు. ప్రపంచంలోనే మన భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతుంది అని.. ఆత్మవిశ్వాసంతోనే భారత్ ముందుకు సాగుతుంది అని వెల్లడించారు.
Jeevan Reddy: హస్తం వదిలి గులాబీ గూటికి జీవన్ రెడ్డి, కాంగ్రెస్ ప్రయత్నాలు విఫలం!
స్టార్ డైరెక్టర్ పై మోనాలిసా సంచలన ఆరోపణలు
