
క్రైమ్ మిర్రర్, ఆంధ్ర ప్రదేశ్:- ఏపీ
జలవనురుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గత వైసిపి పాలనను తీవ్రంగా విమర్శించారు. 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏకంగా 1040 లిఫ్టుల ద్వారా ఎన్నో ఎకరాలకు సాగునీరు అందిస్తే.. కానీ తరువాత వచ్చిన వైసిపి పాలనలో సరైన నిర్వహణ లేకపోవడం వల్ల కేవలం 450 లిఫ్టులు మూలన పడ్డాయని జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వైసీపీ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. కేవలం ఒక వైసీపీ నిర్లక్ష్యంతో నాలుగు లక్షల ఎకరాల ఆయకట్టను సాగు చేయకుండా అలానే వదిలేయాల్సి వచ్చిందని అన్నారు. తాజాగా పట్టిసీమ ఎత్తిపోతల పథకానికి మంత్రి నిమ్మల రామానాయుడు గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించి మోటార్ స్విచ్ ఆన్ చేయడం జరిగింది. దీంతోపాటుగా తాడిపూడి ఎత్తిపోతల జలాలను కూడా విడుదల చేయడం జరిగింది. ఆ తరువాత ఇటుకుల కోట సమీపంలో పట్టిసీమ పథకం వద్ద విడుదలవుతున్న జలాలకు కూడా ప్రత్యేక పూజలు నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లాలో ఐదేళ్లకు పైగా మూలన పడి ఉన్న పురుషోత్తపట్నం పథకం నుంచి పుష్కర కాలవకు నీటిని మంత్రి నిమ్మల రామానాయుడు విడుదల చేశారు. దీన్నిబట్టి గత వైసీపీ ప్రభుత్వంలో ఎంత నిర్లక్ష్యం వహించారో తెలుస్తుందని మంత్రి రామానాయుడు పేర్కొన్నారు.
మార్కాపురం జిల్లా, వెలిగొండ ప్రాజెక్టుపై… స్పష్టత ఇవ్వని పవన్ కళ్యాణ్..!
బాలినేని శ్రీనివాస్ రెడ్డిని అందుకే పార్టీలోకి చేర్చుకున్న : డిప్యూటీ సీఎం పవన్