
క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- బీసీ రిజర్వేషన్ల కోసం యువకుడి ఆత్మహత్య ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. బీసీ ఉద్యమానికి మద్దతు తెలుపుతూ ఈశ్వరి చారి అనే యువకుడు ఆత్మహత్య చేసుకోవడం ప్రతి ఒక్కరిని కూడా కలిచివేసింది. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆఫీసుకు వెళ్లిన యువకుడు బీసీ రిజర్వేషన్లపై ఎంత వీలైతే అంత పోరాటాన్ని ఉదృతం చేయాలని పెట్రోల్ పోసుకొని నిప్పట్టించుకున్నాడు. ఇక ఆ తర్వాత తీవ్రంగా గాయపడటంతో ఈశ్వర్ చారిని గాంధీ ఆసుపత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ మరణించాడు. అయితే ఈ యువకుడి మరణం ముమ్మాటికీ ప్రభుత్వం చేసిన హత్యనే తాజాగా హరీష్ రావు అన్నారు. బీసీ రిజర్వేషన్లపై సీఎం రేవంత్ ఆడిన రాక్షస రాజకీయ క్రీడలో యువకుడు బలైపోవడం ప్రతి ఒక్కరిని కలిచివేసింది అని అన్నారు. ఒక బీసీ యువకుడు ఆత్మబలిదానానికి పాల్పడడానికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వమే అని బీసీ సమాజం ఎప్పటికీ కూడా సీఎంను క్షమించదు అని అన్నారు. వెంటనే ఆ బాధితిడి కుటుంబానికి ప్రభుత్వం 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించి ఆదుకోవాలి అని సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేశారు.
Read also : నా సంగతి తేలుస్తా అన్నాడు.. చివరికి ప్రజలే బుద్ధి చెప్పారు అంటూ సీఎం సెటైర్లు?
Read also : ఎక్కడ చూసినా కోటి సంతకాల హడావిడే కనపడాలి : సజ్జల రామకృష్ణారెడ్డి





