
మహేశ్వరం,క్రైమ్ మిర్రర్:- రంగారెడ్డి జిల్లా,మహేశ్వరం మండల కేంద్రంలో ఈరోజు నిర్వహిస్తున్న మూడో విడత స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్‌ను జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ప్రత్యక్షంగా సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ల కోసం ఏర్పాటు చేసిన మౌలిక వసతులను కలెక్టర్ పరిశీలించారు.ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. మండల పరిధిలోని 163 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు. ఉదయం ప్రారంభమైన పోలింగ్‌లో మధ్యాహ్నం 1 గంటల వరకు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉందని కలెక్టర్ స్పష్టం చేశారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ముగిసిన ఓట్లకు సంబంధించిన అన్ని జాబితాలను కౌంటింగ్‌కు సిద్ధం చేసి,కఠినమైన పోలీసు బందోబస్తు మధ్య లెక్కింపు చేపడతామని తెలిపారు.ఎన్నికలు పూర్తిగా పారదర్శకంగా, శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి వెల్లడించారు.

Read also : Hollywood: అవతార్-3కి షాకింగ్ రివ్యూస్.. ఇచ్చిన సంస్థలు ఇవే..
Read also : భారత్‌లోనూ 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియా బ్యాన్ చేయాలా?





