
మంచి గడప దాటే లోపు… చెడు ఊరంతా చుట్టేసి వస్తుందట. ప్రస్తుతం కాంగ్రెస్‌లోనూ ఇదే పరిస్థితి. చేసిన మంచి పనులు మరుగున పడుతున్నాయి… ప్రజల్లో వ్యతిరేకత మాత్రం రోజురోజుకూ పెరగుతూనే ఉంది. దీనికి కారణం… మంచి పనులను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లలేకపోవడమే. ఎన్నికల సమయంలో ఆరు గ్యారంటీలు ఇచ్చి… అమలు చేయలేకపోతోంది కాంగ్రెస్ ప్రభుత్వం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని… అందుకే హామీల అమలు అలస్యమవుతోందని చెప్తున్నారు మంత్రులు. అయితే… ప్రజలకు ఇవన్నీ పట్టవు. ఇచ్చిన హామీలు అమలు చేశారా… తమకు లబ్ది జరిగిందా.. అన్నదే కావాలి. ఎందుకంటే… హామీల కోసమే బీఆర్‌ఎస్‌ను పక్కన పెట్టి… కాంగ్రెస్‌ను అందలం ఎక్కించారు. అందుకే… ఆరు గ్యారంటీలు అమలు చేయలేకపోతున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. గ్రామస్థాయి నుంచి వ్యతిరేకత పెరుగుతోంది. ఇది కాంగ్రెస్‌కు గడ్డుపరిస్థితే.
Also Read : ఇండ్లలోకి వెళ్లి మోటార్లు సీజ్ చేస్తే ఖబర్దార్.. అధికారులకు మాధవరం వార్నింగ్
ఇదిలా ఉంటే… కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకుంది. కొన్ని వర్గాలకు మంచి కూడా చేసింది. దేశంలో ఎవరూ చేయని విధంగా… ఎస్సీ వర్గీకరణ చేసింది. ఇది చాలా పెద్దవిషయం. ఎస్సీ వర్గీకరణను సరిగా ప్రచారం చేసుకుని ఉంటే… మంచి మైలేజ్ వచ్చేది. కానీ… ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది. ఇక… బీసీ కులగణన… ఇది కూడా కీలక నిర్ణయమే. బీసీలకు 46శాతం రిజర్వేషన్ల బిల్లును అసెంబ్లీలో పాస్ చేసింది. బిల్లును చట్టం చేసేందుకు కేంద్రంతో పోరాడుతోంది. ఈ విషయాన్ని కూడా క్యాష్ చేసుకోలేకపోతోంది రేవంత్‌రెడ్డి సర్కార్. పైగా ప్రతిపక్షాలు చేసిన నెగిటివ్ ప్రచారం… జోరుగా సాగుతోంది. రాజకీయ లబ్ది కోసం.. చేశామంటే చేశామని చెప్పి.. కేంద్రంపై నెట్టేసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేశారంటూ విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. విపక్షాల వాదన… ప్రజల్లోకి బలంగా వెళ్తోంది గానీ… కాంగ్రెస్ వాదనలు మాత్రం చేరడంలేదు. దీంతో… మంచి మరుగునపడి… వ్యతిరేకత పెరుగుతోంది.
Also Read : కోమటిరెడ్డిపై జానారెడ్డి రాజకీయం..రాజగోపాల్‌రెడ్డి మంత్రి పదవికి జానా ఎర్త్..!
హెచ్‌సీయూ భూముల విషయంలో కూడా కాంగ్రెస్ తీరు… అన్ని వర్గాలు తప్పుబట్టాయి. సుప్రీం కోర్టు వరకు వెళ్లి కొట్లాడి తెచ్చుకున్న కంచ గచ్చిబౌలి భూమి విషయంలోనూ ప్రభుత్వం… తన వాదన గట్టిగా వినిపించలేకపోయింది. తమ ప్రభుత్వంలోని కొందరు అధికారులు… దీన్ని తప్పుబట్టారు. కాంగ్రెస్ పరిస్థితి ఇలానే ఉంటే… రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గట్టెక్కే పరిస్థితి ఉండదు. పైగా… అధికారంలో ఉన్న పార్టీ ఓడిపోయిందంటే… ప్రజల్లో వ్యతిరేకత మరింత పెరుగుతోంది. ప్రతిపక్షాల బలం రెట్టింపు అవుతుంది. ఈ భయంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం.. స్థానిక సంస్థల ఎన్నికలను కూడా వాయిదా వేస్తూ వస్తోంది. కాంగ్రెస్ పరిస్థితి మారాలన్నా…. ప్రజల్లో వ్యతిరేకత తగ్గాలన్నా వాయిస్ బలంగా వినిపించాలి. అందుకు ముఖ్యమంత్రి రంగంలోకి దిగాలి. నడుం బిగించి… నియోజకవర్గాల్లో తిరగాలి. రేవంత్‌రెడ్డి ఇప్పుడు అదే ప్లాన్‌లో ఉన్నారు. మే ఒకటవ తేదీ నుంచి నియోజకవర్గాల పర్యటనకు సిద్ధమవుతున్నారు. ఇది ఎంత వరకు వర్కౌట్ అవుతుంది… కాంగ్రెస్ పార్టీ మైలేజ్ ఎంత వరకు పెంచుతుందో…? చూడాలి.
ఇవి కూడా చదవండి ..
-
సూర్యాపేటలో ఫేక్ హాస్పిటల్.. డాక్టర్ పై ఫోర్జరీ కేసు
-
నిండు గర్భిణి.. కొన్ని గంటల్లో పుట్టబోయే బిడ్డ – అబ్బా.. ఎంత దారుణంగా చంపాడో..!
-
అమెరికా యూనివర్శిటీలో కాలులు.. రంగంలోకి డొనాల్డ్ ట్రంప్
-
సీఎం రేవంత్ రెడ్డికి గండం!సుప్రీంకోర్టుకు సీఈసీ సంచలన రిపోర్ట్
-
ఏపీలో లిక్కర్ స్కామ్ – హైదరాబాద్‌లో హడావుడి – కసిరెడ్డి నుంచి దారి జగన్ వైపుకా..!