
క్రైమ్ మిర్రర్, తెలంగాణ :- మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలకు దూరమై చాలా రోజులు అవుతుంది. రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉన్నా కూడా కొంతమంది ఇంకా విమర్శిస్తూనే ఉన్నారని చిరంజీవి చెప్పుకొస్తూ ఎమోషనల్ అయ్యారు. నాపై వస్తున్న రాజకీయ విమర్శలకు నేను ఎప్పుడూ కూడా పెద్దగా స్పందించలేదని స్పష్టం చేశారు. రాజకీయం ద్వారా నేను ఎంతోమంది ప్రేమను పొందాను… ఎంతోమంది విమర్శకులను కూడా పొందాను అని అన్నారు. కానీ నేను పొందిన ప్రేమ, నేను చేసిన మంచే నాకు రక్షణ కవచంగా ఉంటుందని అన్నారు. తాజాగా మెగా బ్లడ్ డొనేషన్ డ్రైవ్ కార్యక్రమంలో భాగంగా చిరంజీవి ఇలాంటి ఎమోషనల్ వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకు ఈ బ్లడ్ డొనేషన్ లో ఎంతోమంది బ్లడ్ డొనేషన్ చేశారని తెలిపారు. ఈ బ్లడ్ డొనేషన్ కార్యక్రమంలో నా మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ భాగమైనందుకు చాలా గర్వంగా ఉంది అని చిరంజీవి చెప్పుకొచ్చారు.
Read also : అమ్మ ప్రాణాన్ని బలి తీసుకున్న కొత్త కారు.. చౌటుప్పల్ వద్ద ప్రమాదం!
ఈ కార్యక్రమంలో భాగంగా చిరంజీవి కొన్ని ఇన్సిడెంట్స్ గురించి చెప్పుకొచ్చారు. రాజమండ్రిలో ఒక తల్లి కొడుకు గురించి ఆవేదన చెందిన సమయంలో రాజమండ్రి యువకులు ఈ బ్లడ్ డొనేషన్ ద్వారా ఎంతో సహాయం చేశారని చెప్పుకొచ్చారు. అలాగే కొంతమంది మాట్లాడుతూ సోషల్ మీడియా వేదికగా మిమ్మల్ని అలాగే మెగా ఫ్యామిలీని ఎన్నో విధాలుగా విమర్శిస్తుంటారు… మీ గౌరవాన్ని తగ్గిస్తుంటే మీరు ఎందుకు అలా మౌనంగా ఉంటారు? అని చాలామంది నన్ను అడిగారని చిరంజీవి చెప్పుకొచ్చారు. వాళ్లు విమర్శించినంత మాత్రాన… వాళ్లు నా గౌరవాన్ని దెబ్బతీసినంతమాత్రాన నాకేం అవ్వదు అని అన్నారు. ఎంతమంది అభిమానులు నాకు ప్రేమను పంచి పెడుతుంటే… అవే నాకు రక్షణ కవచగా అండగా ఉంటాయని చిరంజీవి స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో ప్రతిరోజు ఎన్నో విమర్శలు వస్తూనే ఉంటాయని.. అవన్నీ పట్టించుకుంటే మనం ముందుకు సాగలేమని అన్నారు. ఈ జన్మకు ఇలాంటి ఎంతోమంది అభిమానుల ప్రేమ చాలు అని అన్నారు.
Read also : రాజా సాబ్ సినిమా నుంచి మరో కీలక అప్డేట్.. పార్ట్-2 కూడా ఉంది!