
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిన్న అనంతపురం జిల్లాలో పర్యటించిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. “సూపర్ సిక్స్ – సూపర్ హిట్” అనే కార్యక్రమంలో భాగంగా నారా చంద్రబాబు నాయుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై తీవ్రంగా మండిపడ్డారు. ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత ప్రతిపక్ష నాయకులు ఎవరైనా సరే అసెంబ్లీకి రావాలి. కానీ వైసీపీ నేతలు మాత్రం అసెంబ్లీకి రాకుండా సోషల్ మీడియాలలో ఆఫీసులు తెరిచారని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వైయస్సార్సీపి పార్టీ నాయకులను తీవ్రంగా విమర్శించారు. రాజకీయాల్లో ఓనమాలు తెలియని వాళ్లు కూడా ప్రతిపక్ష హోదా కావాలంటున్నారని ఎద్దేవా చేశారు. ఇదంతా ప్రజలు గమనిస్తూనే ఉంటారు… కచ్చితంగా ప్రజలు జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ బుద్ధి చెబుతారని చంద్రబాబు నాయుడు అన్నారు.
Read also : గులాబీ గలగల.. అత్యంత ధనిక పార్టీ అదే!
అసెంబ్లీకి రాకుండా.. రప్పా రప్పా అని రాంకలేస్తూ ఎవరిని బెదిరిస్తున్నారని చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి తీవ్రంగా ఫైర్ అయ్యారు. రప్పా రప్పా అన్నందుకే… పులివెందుల అలాగే ఒంటిమిట్ట ఉప ఎన్నికల్లో దారుణమైన పరాజయాన్ని చవిచూశారని అన్నారు. ప్రజలందరూ వైసీపీ పార్టీకి ఓట్లతో సమాధానం చెప్పారని చెప్పుకొచ్చారు. మీరేం చేసినా చూస్తూ ఊరుకోమని.. ఇక్కడుంది చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అని వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్రంలో వైసీపీ పార్టీ ఉనికిని కోల్పోతుంది అని… వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఫేక్ రాజకీయాలు చేస్తున్నారని చంద్రబాబు నాయుడు తీవ్రంగా మండిపడ్డారు. ప్రభుత్వం ఏ కార్యక్రమాలను చేపట్టిన కూడా అడ్డుకోవాలని ప్రయత్నాలు చేస్తుందని వైసీపీ పార్టీపై, జగన్ పై ఫైర్ అయ్యారు. సిద్ధం, సిద్ధం అంటూ బయట అరవడం కాదు… అసెంబ్లీకి వస్తే చర్చించడానికి నేను సిద్ధం అని అనంతపురం నుండి సవాల్ విసిరారు చంద్రబాబు. అసలు జగన్మోహన్ రెడ్డి రాజకీయాలకు అర్హులేనా అని చంద్రబాబు నాయుడు ప్రజలను ఆలోచించుకోవాలని కోరారు.
Read also : గులాబీ గలగల.. అత్యంత ధనిక పార్టీ అదే!