
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదం కల్తీ విషయంలో కావాలనే నాపై చాలామంది అసత్య ప్రచారాలు చేస్తున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి అన్నారు. గత వైసిపి ప్రభుత్వం లో తిరుమల తిరుపతి దేవస్థానంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదం కల్తీ జరిగిందని కూటమి నేతలు ఆరోపించిన విషయం తెలిసిందే. తాజాగా తిరుమల లడ్డులో వాడినటువంటి నెయ్యి కల్తీ నెయ్యి అని కూడా తేలింది. ఈ సందర్భంలోనే ఈ కల్తీ నెయ్యి వెనుక వై వి సుబ్బారెడ్డి ఉన్నారు అని సోషల్ మీడియా వేదిక ఎన్నో వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయంపై స్పందిస్తూ వైవి సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలు మరో చర్చకు దారితీస్తున్నాయి. తిరుమల శ్రీవారి లడ్డు విషయంలో తనపై వచ్చే వార్తలు అన్నీ కూడా అసత్యమే అని వెల్లడించారు. ఇక ఇప్పటివరకు నేను 30 సార్లు అయ్యప్ప మాల వేసుకున్నాను అని.. నేను ఉన్నంతకాలం దేవుడి ప్రతిష్ట పెంచేలా పనిచేశానే గాని.. ఇలా ఉపకారం చేసే మనసు అయితే నాకు లేదు అని వైవి సుబ్బారెడ్డి పేర్కొన్నారు. ఇక ఇన్ని ఆరోపణలు వస్తున్న వేల ఈ కేసుకు సంబంధించి లై డిటెక్టర్ పరీక్షకు కూడా నేను సిద్ధంగా ఉన్నాను అని స్పష్టం చేశారు. ఇక అంతేకాకుండా కల్తీ నెయ్యి ఘటనలో నిజ నిజాలు తెలియడానికి సుప్రీంకోర్టులో దాఖలు వేసినట్లు ఆయన తెలిపారు. దీంతో వైవి సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలు మరో కొత్త చర్చకు దారితీస్తున్నాయి. ఏది ఏమైనా కూడా సాక్షాత్తు కొన్ని కోట్ల మంది కొలిచేటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులకు ఇచ్చేటువంటి లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి ఉపయోగించడం పై ప్రతి ఒక్కరు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Read also : కాంగ్రెస్ జెండాను పోలిన చీరను ధరించిన కవిత.. దీనికి సంకేతం!
Read also : పెళ్లి చేసుకున్న ఆస్కార్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్!





