
క్రైమ్ మిర్రర్,తెలంగాణ:- తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఇప్పటికే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవడం వల్ల ప్రజలు నాన్న తిప్పలు పడడమే కాకుండా ఇప్పుడే కాస్త వర్షాల నుంచి రిలీఫ్ పొందుతున్నారు. తుఫాన్ ఎఫెక్ట్ కారణంగా వాగులు మరియు వంకలు రెండు తెలుగు రాష్ట్రాలలో పొంగిపొర్లడమే కాకుండా ప్రజలకు ఎన్నో ఇబ్బందులను తెచ్చిపెట్టాయి. ముఖ్యంగా వాహనదారులకైతే ఈ తుఫాన్ ఎఫెక్ట్ కారణంగా చాలానే ఇబ్బందులు పడ్డారని చెప్పవచ్చు. అయితే తుఫాన్ ప్రభావం తగ్గింది అని ఇప్పుడిప్పుడే కాస్త ప్రశాంతంగా ఉన్న ప్రజలకు వాతావరణ శాఖ అధికారులు మరొక చేదు వార్తను తెలిపారు. అదేంటంటే… రానున్న మరో రెండు రోజుల్లో తూర్పు మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనున్నట్లుగా వాతావరణ అధికారులు వెల్లడించారు. ఈ అల్పపీడనం కారణంగా ఏపీతోపాటు తెలంగాణ రాష్ట్రంలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించారు. ఇవాళ మరియు రేపు రాయలసీమ మరియు కోస్తాలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడుతాయని పేర్కొన్నారు. కాగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ పలుచోట్ల పిడుగులతో కూడినటువంటి తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపారు. కాబట్టి ఏవైనా అత్యవసర పరిస్థితులు, ప్రయాణాలు ఉంటే ఈ రెండు రోజుల్లో చూసుకోవాలని అధికారులు సూచించారు.
Read also : రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి లేనట్టే! రేవంత్ దిమ్మతిరిగే షాక్
Read also : బ్రేకింగ్ న్యూస్.. కర్నూలు బస్సు ప్రమాదంపై దుష్ప్రచారాలు చేస్తున్న వ్యక్తులపై కేసులు నమోదు!





