
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్షాలు దంచి కొడతున్నాయి. ఒక్కరోజు వర్షం పడకపోతే ఆహా అనుకునే లోపు మరో రెండు మూడు రోజులు పాటు వర్షాలు దంచి కొడుతున్నాయి. గత రెండు నెలల నుంచి సూర్యుడిని చూసింది మాత్రం రెండు మూడు రోజులు మాత్రమే. అంతలా వర్షాలు అలాగే మేఘాలు కమ్ముకున్నాయి. నేడు మళ్ళీ వాతావరణ శాఖ అధికారులు మరో మప్పు ఉందంటూ దాని గురించి తెలియజేశారు. రెండు రోజుల్లో దేశం నుంచి నైరుతి రుతుపవనాలు కనుమరుగవుతాయని పేర్కొన్నారు. అయితే ఇప్పటికే ఒడిశా మరియు చతిస్గడ్ ఈశాన్య రాష్ట్రాల నుంచి నైరుతి రుతుపవనాలు నిష్క్రమించినట్లు తెలిపారు. ఇక ఇదే టైంలో ఈశాన్య రుతుపవనాలు సౌత్ ఇండియాలోకి ప్రవేశిస్తాయని స్పష్టం చేశారు. ఈ ఉపరితల ఆవర్తనాల కారణంగా పలు జిల్లాల్లో రాబోయే మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు దంచి కొడుతాయని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి, నెల్లూరు అలాగే ప్రకాశం జిల్లాలో ఉపరితల ఆవర్తనం ఎఫెక్ట్ కారణంగా ఈ మూడు జిల్లాల్లో పిడుగులతో కూడినటువంటి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. కాబట్టి మరో రెండు మూడు రోజులపాటు ఈ మూడు జిల్లాల ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్ళవద్దని.. వర్షం పడుతున్న సమయంలో చెట్ల కింద నిల్చోవద్దని పలు సూచనలు చేస్తున్నారు. ఇక వాహనదారులు కూడా ఏదైనా అత్యవసరమైన పని ఉంటే తప్ప బయటకు వెళ్లవద్దని సూచించారు. ఏది ఏమైనా కూడా గత రెండు నెలల నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు ప్రజలు ఎన్నో తిప్పలు పడుతున్నారు.
Read also : మోడీ పర్యటన ఎఫెక్ట్… రెండు జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు!
Read also : పక్కకు తప్పుకున్న శ్రీ లీల.. అఖిల్ కు జోడిగా సరికొత్త హీరోయిన్