
క్రైమ్ మిర్రర్, వైరల్ న్యూస్:- ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా యువకులు చాలామంది వివిధ కారణాల వల్ల మరణిస్తున్నారు. అయితే వీటన్నిటిలో యువత ఎక్కువగా బ్రేకప్ ల కారణంగానే మరణిస్తున్నారని సూసైడ్ ప్రివెంటివ్ హెల్ప్ లైన్ సంస్థ ( వన్ లైఫ్) తెలిపింది. ఈ వన్ లైఫ్ సంస్థ.. యువత ఎక్కువగా ఎందుకు మరణిస్తున్నారు అనే విషయాలను కూడా పంచుకుంది. ప్రస్తుతం మన భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రేమించడం, ప్రేమ పెళ్లి చేసుకోవాలి అనేది ఫ్యాషన్ గా మారిపోయింది. కొంతమందికి అదృష్టం వల్ల మరి కొంతమంది కి తల్లిదండ్రులు ఒప్పుకోవడం ద్వారా ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నారు. ఇక ప్రేమను ఒప్పుకోని వారు చనిపోవడం ఒక్కటే మార్గమని సూసైడ్ చేసుకుంటున్నారు. కాబట్టి కేవలం మనదేశంలో బ్రేకప్ లో కారణంగానే ఆత్మహత్యలు పెరుగుతున్నాయని వన్ లైఫ్ సంస్థ ప్రకటించింది.
Read also :మరికొద్ది సేపట్లో వర్షాలు.. ఈ 20 జిల్లాల ప్రజలు అలెర్ట్!
మరోవైపు యువత ఎక్కువగా అప్పులు చేయడం, వైవాహిక సమస్యలు, నిరుద్యోగం, బెట్టింగ్, ఒత్తిడి మరియు ఆర్థిక మోసాలతో చాలామంది సూసైడ్ చేసుకోవడం జరుగుతుందని తెలిపింది. మా సంస్థకు ప్రతి సంవత్సరం దాదాపు 23,000 కాల్స్ వస్తాయని తెలిపింది. ఫోన్ చేసిన ప్రతి ఒక్కరికి కౌన్సిలింగ్ ఇస్తూ వారిలో ధైర్యం నింపుతున్నామని చెప్పుకొచ్చింది. యువతను అలానే వదిలేస్తే ఖచ్చితంగా వారు సూసైడ్ ఒకటే మార్గం అని అనుకుంటారని… కాబట్టి వారికి కౌన్సిలింగ్ ఇచ్చి ప్రతి ఒక్కరిలోను ధైర్యం నింపడమే మా బాధ్యత అని చెప్పింది. నేడు ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా.. దేశంలో ఆత్మహత్యల గురించి వన్ లైఫ్ సంస్థ వివరణ ఇచ్చింది. తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు… వాళ్ళ ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉండాలని వన్ లైఫ్ సంస్థ తల్లిదండ్రులకు సూచిస్తుంది.
Read also : సౌత్ ఆఫ్రికా t20 లీగ్ లో మళ్ళీ అవమానం.. బవుమా పరిస్థితి ఏంటి?