
తెలుగు రాష్ట్రాలలో వినాయక చవితి పండుగను చాలా ఘనంగా నిర్వహిస్తారు. దీంతో పెద్ద పెద్ద మండపాలు ఏర్పాటు చేసి, భజనలు, వినాయకుడి పాటలు, డీజెలతో గణపయ్యను తొమ్మిది రోజులపాటు పూజిస్తారు. అయితే గణపతి నవరాత్రుల కోసం మండపాలు ఏర్పాటు చేసే వారికి తెలంగాణ పోలీస్ హెచ్చరికలు జారీ చేసింది. ఇందులో ముందుగా గణేష్ మండపాలు ఏర్పాటు చేయాలంటే నిర్వాహకులు తప్పనిసరిగా తెలంగాణ గవర్నమెంట్ పోలీసులను సంప్రదించి పర్మిషన్ తీసుకోవాలని హెచ్చరించారు. ఒకవేళ నేరుగా సంప్రదించడం కుదరకపోతే ఆన్లైన్లో policeportal.tspolice.gov.in/index.html ద్వారా పర్మిషన్ కి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.
అలాగే వినాయకుడి మండపాలు ఏర్పాటు చేసే విషయంలో తప్పనిసరిగా పోలీసులు సూచించిన జాగ్రత్తలు తీసుకోవాలని లేదంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే మండపంలో విద్యుత్ కనెక్షన్లు కోసం ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ లేదా ఎలక్ట్రికల్ వర్క్స్ చేసే నైపుణ్యం కలిగిన వారిని మాత్రమే ఉపయోగించాలని అంతేతప్ప సొంత ప్రయోగాలు అస్సలు చేయొద్దని సూచించారు. అయితే విద్యుత్ కనెక్షన్ కోసం ముందుగా బ్యాంకులో డిడి తీయాలని తెలిపారు.
(5) Telangana Police (@TelanganaCOPs) / X
ఇక వినాయకుడిని దర్శించుకునేందుకు మండపానికి వచ్చే భక్తులకు పార్కింగ్ ఏర్పాట్లు తప్పనిసరిగా ఉండాలని సూచించారు. మండపాలను ఏర్పాటు చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటిస్తూ గాలి, లేదా వానలు వంటివి సంభవించినప్పుడు వాటిని సమర్థవంతంగా తట్టుకునే విధంగా మండపాలు నిర్మించుకోవాలని కోరారు. ఇక వినాయకుడి ఊరేగింపు లేదా దర్శనం సమయంలో ఎవరైనా వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపిస్తే తప్పనిసరిగా దగ్గరలో ఉన్న పోలీసులకు సమాచారం అందించాలని లేదా 100 కి డయల్ చేసి డీటెయిల్స్ తెలియజేయాలని కోరారు.