
గట్టుప్పల, క్రైమ్ మిర్రర్:- నల్గొండ జిల్లా గట్టుప్పల గ్రామంలో ఓ విచిత్రమైన పరిస్థితి ఉంది. జాతి రత్నాలు సినిమాలో హీరో ఫ్రెండ్ ఓ అపార్ట్మెంట్లో పని చేస్తాడు…. హీరో అక్కడికి వెళ్ళినప్పుడు అతను ఒక డైలాగ్ చెప్తాడు ఈ అపార్ట్మెంట్లో ఉండేటోళ్లు ఎవ్వరూ ఈడ ఉండరు అని…. సేమ్ సీను ఈ గట్టుప్పల గ్రామంలో కూడా కనబడుతుంది. గ్రామంలో చెప్పుకోబడే ముఖ్య నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు దాదాపుగా ఎవరు కూడా స్థానికంగా ఉండరు. వ్యాపారాలు, వ్యవహారాలరీత్యా దాదాపుగా అంతా హైదరాబాదులోనే ఉంటారు. స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇప్పుడు గ్రామంలో ఓ చర్చ నడుస్తుంది. మన నేతలు ఇంతకు మన గ్రామంలోనే ఉంటున్నారా సిటీకి విలేజ్ కి అప్ అండ్ డౌన్ చేస్తున్నారా అనేది ప్రస్తుతం చర్చనీయా అంశంగా మారి. అయితే గ్రామానికి చెందిన మాజీ సర్పంచి నామని జగన్నాథం మాత్రం స్థానికంగా ఉంటున్నారనేది ప్రముఖంగా వినబడుతోంది . వచ్చే ఎన్నికల్లోనూ ఆయన బరిలో నిలవాలనుకుంటున్నారు. అయితే స్థానిక సమరంలో చాలామంది నాయకులు పోటా పోటీగా బరిలో ఉంటారు. అయితే ప్రజలు స్థానికత అనేది ఎంత మేరా ప్రాధాన్యత ఇస్తారు అనేది ప్రశ్నార్ధకం?. అయితే చాలా వరకు ప్రజలు తమ నాయకుడు లోకల్ గా ఉన్నాడా సిటీలో ఉన్నాడా అని కాకుండా ఆపద సాపద అంటే వచ్చి ఆదుకుంటున్నారా అనేది ప్రాధాన్యత ఇస్తారు అనటంలో సందేహం లేదు. ఎక్కడ ఉంటే ఏంది కావలసింది పని అనే వారు కూడా ఉన్నారు. స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడితే అందరు కూడా గ్రామంలోకి వచ్చి విడిది చేస్తారు. ఇక్కడ ఎన్నికలు ఓ పండగ వాతావరణం లో జరుగుతాయి. ఎన్నికల ముగిసాక జాతర ముగిసినట్లుగానే అందరూ ఎవరి పనులకు వారు వెళ్ళిపోతారు.