
గట్టుప్పల, క్రైమ్ మిర్రర్:- గట్టుప్పల మండలాన్ని తెచ్చిన ఘనత తమదేనని తెచ్చిన మండలాన్ని అన్ని విధాల ముందుకు తీసుకెళ్లేందుకు తాము అనేక విధాలుగా కృషి చేశామని ఈ 18 నెలల్లో గట్టుప్పలలో అధికార పార్టీ నాయకులు చేసింది శూన్యమని… గట్టుప్పల అభివృద్ధిపై చర్చకు రావాలంటూ బిఆర్ఎస్ నాయకుడు,మాజీ జెడ్పిటిసి కర్నాటి వెంకటేశం కాంగ్రెస్ పార్టీ నాయకులు జవాబు చెప్పాలని అన్నారు. ఆయన ఇవ్వాళా క్రైమ్ మిర్రర్ ప్రతినిధి తో మాట్లాడారు. గత ప్రభుత్వాయాంలోనే ప్రభుత్వ ఆసుపత్రికి రూ.1.40 కోట్లు మంజూరు అయ్యాయని.. స్థల సేకరణ దగ్గరుండి చేయించామన్నారు. కానీ నేటికీ గట్టుప్పలకు ప్రభుత్వ ఆసుపత్రిని ఈ అధికార పార్టీ నాయకులు తెప్పించలేకపోయారన్నారు. ఆసుపత్రి మంజూరు అయితే కొత్త భవనం పూర్తయ్యే వరకు తాత్కాలిక భవనంలోనైనా వైద్య సేవలు ప్రజలకు అందుబాటులో ఉంటాయన్నారు.
Read also: కనకదుర్గమ్మ సాక్షిగా తప్పుడు కథనాలను ఖండించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి!
గట్టుప్పల- అంతంపేట లింకు రోడ్డుకు 3కోట్లు, గట్టుప్పల- వాయిళ్లపల్లి లింకు రోడ్డుకు 4 కోట్లు తాను దగ్గరుండి మంజూరి చేయించానని తెలిపారు. 18 నెలలుగా స్థానిక కాంగ్రెస్ నాయకులు ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని చేపట్టింది లేదని తెలిపారు. పైగా గట్టుప్పల వాయిళ్ల పల్లి లింకు రోడ్డుకు మంజూరైన 4 కోట్ల నిధులు వీళ్ళ నిర్లక్ష్యం కారణంగా వెనక్కి వెళ్ళాయని తెలిపారు. గట్టుప్పల మండల కేంద్రంలో రోడ్డు విస్తరణ కోసం 8 కోట్ల రూపాయలు ఎస్టిమేషన్ వేయించడం జరిగిందని కానీ ఈ ప్రభుత్వం దానిని పట్టించుకుందే లేదన్నారు. గట్టుప్పల నుంచి ఇడికుడ వరకు డబుల్ రోడ్డు నిర్మాణానికి గత ప్రభుత్వంలో 30 కోట్ల రూపాయలు మంజూరు అయ్యాయని కానీ ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా అక్కడక్కడ నిర్మాణం తప్ప రోడ్డు నిర్మాణ పనులు సాగటం లేదన్నారు. గట్టుప్పల్ మండల అభివృద్ధి ఎవరితోనో సాధ్యమో ప్రజలందరికీ ఇప్పటికే అర్థమైంది అన్నారు.
Read also : 20 వేల మందితో బతుకమ్మ… హెలికాప్టర్ల నుంచి పూలవర్షం!