
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలీస్ శాఖను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. పోలీస్ శాఖను సాంకేతికంగా బలోపేతం చేస్తున్నామని వెల్లడించారు. తాజాగా నేడు మంగళగిరిలో పోలీసులు సంస్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. శాంతిభద్రతల విషయంలో ఎక్కడ రాజీ పడే ప్రసక్తే లేదని మరోసారి స్పష్టం చేశారు. పోలీస్ శాఖ వారు సీసీ కెమెరాలు, గూగుల్ టేక్ అవుట్లు, డ్రోన్లు వంటి సాంకేతికతను వినియోగించుకోవాలని తెలిపారు. పోలీసుల సంక్షేమం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా పోలీసులు చేస్తున్నటువంటి ఘనతలు తప్పకుండా మెచ్చుకోవాలి. కుటుంబాన్ని సైతం పక్కన పెట్టేసి ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి పోలీసులను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రశంసించారు. కాగా నేడు దేశవ్యాప్తంగా పోలీసు అమరవీరుల స్మారక దినం సందర్భంగా ఇప్పటికే అన్ని రాష్ట్రాల పోలీసులను ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రశంసిస్తున్నారు. అమరులైన పోలీసులకు నివాళులర్పిస్తున్నారు. ఇప్పటికే అమరవీరులందరికీ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా నివాళులర్పించారు.
Read also : అల్పపీడనం ఎఫెక్ట్.. ఈ జిల్లాలో దండిగా వర్షాలు!
Read also : కాంగ్రెస్, బీఆర్ఎస్ ఓకే… ప్రచారంలో బీజేపీ స్పీడ్ పెంచుబోతుందా?