
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఫేక్ ప్రచారాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. రాష్ట్రంలో కల్తీ మద్యం అమ్ముతున్నారంటూ కూటమి ప్రభుత్వంపై ప్రతిపక్ష పార్టీ నేతలు అలాగే సోషల్ మీడియా వేదికగా ప్రచారాలు రాగా వీటిపై తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. ఎక్కడో అన్నమయ్య జిల్లాలో జరిగిన కల్తీ లిక్కర్ ఘటనపై వైసీపీ పార్టీ మరియు పార్టీ నాయకులు రాజకీయ లబ్ధి కోసం రాష్ట్రమంతటా కూడా ఫేక్ ప్రచారాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఈ కల్తి మద్యం తాగి ప్రజల ప్రాణాలు పోతున్నాయని ప్రజలను భయపెట్టడం ఏంటని… ఇలా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాగే ప్రతి ఒక్క జిల్లాలోని మంత్రులు అలాగే ఎమ్మెల్యేలు వీటిని ఖండించాలి అని చెప్పుకొచ్చారు. వివేక హత్యలో మీరు ఎటువంటి డ్రామాలు ఆడారో మర్చిపోవద్దు అని మరోసారి గుర్తు చేశారు. వైసీపీ ప్రభుత్వం లోనే కల్తీ మద్యం ద్వారా ఎంతో మంది మరణించారు అని స్పష్టంగా అందరికీ తెలుసు అని అన్నారు. మా ప్రభుత్వంలో తక్కువ ధరకే మద్యం అందించాం కానీ… ఎక్కడ కల్తీ జరగలేదు అని చెప్పుకొచ్చారు. ఫేక్ ప్రచారాలతో ఆ పార్టీ ప్రజల్ని మభ్య పెట్టాలని చూస్తుంది అని సీఎం తీవ్రంగా విమర్శించారు. వెంటనే ఇటువంటి ఫేక్ ప్రచారాలు చేసే వారి పై చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం ఆదేశాలను జారీ చేశారు. రాష్ట్రంలో వైసీపీ మరియు కూటమి మధ్య హోరాహోరీ గా రాజకీయం వేడెక్కింది.
Read also : దేశమంతా “ZOHO” పిలుపే… అట్లుంటది ప్రధాని మోదీతో..!
Read also : ఉత్కంఠంగా మారిన జగన్ పర్యటన.. మరో కరూర్ ఘటన అవ్వబోతుందా?