
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తాజాగా మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్కు దేవుడంటే లెక్కలేదు అని.. భక్తుల మనోభావాలు దెబ్బ తినేలా జగన్ వ్యాఖ్యలు ఉన్నాయి అని అన్నారు. ఇక గత వైసిపి పాలనలో నుంచి రాష్ట్రంలో నేరస్తులు బాగా తయారు అయ్యారు అని సీఎం చంద్రబాబు నాయుడు తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్రంలో ఎంతోమంది రౌడీ షీటర్లను తయారు చేశాడని.. వారందరి తోకలను కచ్చితంగా కట్ చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. ఈరోజు మీడియాతో చిట్ చాట్ కార్యక్రమంలో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ జగన్ దేవుళ్ళ పట్ల వ్యవహరించేటువంటి తీరు పై అసహనం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డికి దేవుడన్నా, ఆలయాల పవిత్రతన్నా లెక్క లేదని తెలిపారు. సొంత బాబాయ్ హత్యనే సినిమా లెవెల్ లో సెటిల్ చేద్దామని అనుకున్న అతను ఈరోజు పరకామణి చివరి కేసును కూడా సెటిల్ చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. సాక్షాత్తు వెంకన్న స్వామి ఆలయంలో డబ్బులను దొంగతనం చేసిన వ్యక్తికి అతను మద్దతుగా నిలుస్తున్నాడు అంటే అక్కడే అతని వ్యక్తిత్వం మరియు దేవులపై ఉన్న భక్తి ఏంటో అర్థం అవుతుంది అని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఎప్పుడు కూడా భక్తుల మనోభావాలు దెబ్బ తినేలా మాట్లాడవద్దు అని సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు.
Read also :అజ్జిలాపురం సర్పంచ్ అభ్యర్థి నిర్వాహకం.. మధ్యం, కాసులతో ఓటర్లకు వల?
Read also : కృష్ణ కృష్ణ… ఏందయ్యా ఈ బౌలింగ్!





