
క్రైమ్ మిర్రర్,జాతీయ న్యూస్ :-నటుడు సోనూసూద్ సోషల్ మీడియాను ఉద్దేశించి తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం వివిధ దేశాలలో పదహారేళ్ల సంవత్సరాలలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధం చేస్తున్నట్లు ప్రకటించిన విషయాలు ప్రతి ఒక్కరు వినే ఉంటారు. గత కొద్ది రోజుల క్రితం ఆస్ట్రేలియా సైతం తమ దేశంలోని 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధిస్తున్నాము అని ప్రకటించారు. అదే విధంగా మన దేశంలో కూడా 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించాల్సిన అవసరం ఉంది అని సోనూ సూద్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుత రోజుల్లో పిల్లలు భోజనం చేస్తూ ఫోన్లలో మునిగిపోవడం చాలా ఆందోళనకరంగా మారింది అని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఈ విషయంపై ఇప్పటికే ఆలోచనలు చేస్తూ సోషల్ మీడియాను నిషేధించే దిశగా అడుగులు వేస్తుండగా గోవా రాష్ట్రం సైతం ఈ విషయాన్ని అనుసరించే అవకాశం ఉందని తెలిపారు. ఈ విషయాన్ని జాతియ ఉద్యమంగా మార్చాలి అని తాజాగా నటుడు సోనోసూద్ ఎక్స్ వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేశారు. పలు సందర్భాలలో ఇతరులకు ఆర్థికంగా సహాయం చేసే సోనూసూద్ తాజాగా పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఇలా స్పందించడం నిజంగా తన మనసుకి హాట్సాఫ్ అంటూ సోషల్ మీడియా వేదికగా అతనికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఈ విషయంపై కేంద్రం సైతం ఆలోచించాలి అని ప్రతి ఒక్కరు కూడా కోరుతున్నారు.
Read also : కారు, బుల్లెట్ బైక్ నడపడం రాదని భర్తను వదిలేసిన భార్య.. అంతటితో ఆగకుండా..
Read also : తల్లిదండ్రులు, చెల్లిని చంపి.. ఇంట్లోనే పూడ్చిపెట్టాడు!





