జాతీయం

పట్టుమని రెండు బ్లాక్ బస్టర్ లేదు....శర్వానంద్ కి వందల కోట్లు ఆస్తి ఎలా వచ్చింది?

హీరో శర్వానంద్ గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక టాపిక్ అనేది వైరల్ గా మారింది. శర్వానంద్ కి కొన్ని వందల కోట్లు ఆస్తి ఉన్నాయని ఇప్పుడు అందరూ కూడా చర్చించుకుంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా పట్టుమని పది ఇట్లుల్లేవు అలాగే రెండు సినిమాలైనా బ్లాక్ బస్టర్ కాలేదు కానీ కొన్ని వందల కోట్లు శర్వానంద్ కి ఎలా వచ్చాయని అందరూ మాట్లాడుకుంటున్నారు.

శర్వానంద్ ప్రస్తుతం మన టాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకొని మంచి హీరోగా కొనసాగుతున్నాడు. శర్వానంద్ యువసేన అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా అనేది హిట్ అయింది. ఆ తర్వాత గమ్యం,ప్రస్థానం,రన్ రాజా రన్, మహానుభావుడు అలాగే శతమానం భవతి సినిమాల్లో నటించి మంచి పేరు కూడా తెచ్చుకున్నాడు. అయితే ఒక సినిమాకి శర్వానంద్ 5 కోట్ల నుండి 10 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకునేవాడు. అయితే మరి తక్కువ రిమినరేషన్ తీసుకునేవాడు బ్యాక్ గ్రౌండ్ లో ఎన్ని వందల కోట్లు ఎలా ఉన్నాయి అంటూ అందరూ కూడా ఆరా తీస్తున్నారు.

Read More : దుర్గమ్మ ఆశీస్సులతో ప్రభాస్ కి పెళ్లి.. శ్యామలాదేవి

అయితే ఒక రిపోర్టర్ హైదరాబాదులో మీకు సగం ఆస్తులు ఉన్నాయని అలాగే సగం హైదరాబాదే మీరు కొనేయగలరని అని అడిగాడు. దానికి శర్వానంద్ సమాధానం ఇస్తూ మీరన్నట్లు హైదరాబాదులో మాకు చాలానే ఆస్తులు ఉన్నాయి. మా నాన్న బిజినెస్ మాన్ కావడం వల్ల హైదరాబాద్లో చాలా అని బిజినెస్ ప్రాపర్టీలు ఉన్నాయని నాకు చెప్పాడు. కానీ మా నాన్న బిజినెస్ మీద వచ్చేటువంటి డబ్బులు మీద నేను ఆధారపడను. ఇప్పటికీ కూడా నా సొంత డబ్బులతో నేను నా అవసరాలను తీర్చుకుంటానని చెప్పుకొచ్చాడు. ధీంతో అందరూ కూడా ఇది వాళ్ళ నాన్న ఆస్థి అని షాక్ నుండి బయటకి వచ్చారు.

Back to top button