
క్రైమ్ మిర్రర్,యాదాద్రి భువనగిరి:-
యాదాద్రి భువనగిరి జిల్లా, ఆత్మకూరు(ఎం)మండల కేంద్రంలోని ఎరువుల దుకాణాలను శనివారం రోజున సహాయ వ్యవసాయ సంచాలకులు శ్రీనివాస్ గౌడ్ మరియు మండల వ్యవసాయ అధికారి శ్రీనివాస్ తనిఖీ చేశారు. ఎరువుల స్టాక్ రిజిష్టర్లును పరిశీలించారు. ఎరువుల దుకాణాలలో ప్రతీ రోజు యూరియా అమ్మకాలు ఈ పాస్ మిషన్ ద్వారానే జరగాలని, యాసంగి సీజన్ కు సరిపడా యూరియా మరియు ఇతర ఎరువులు రైతులకు అందుబాటులో ఉన్నాయని యూరియా సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు లేవని తెలియజేశారు. ఆత్మకూరు(ఎం) మండలంలో కో-ఆపరేటివ్ సొసైటీలు మరియు ప్రైవేటు డీలర్ల దగ్గర మొత్తం 40 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉంది. రైతులు ఎరువులను సిఫార్సు చేసిన మోతాదులో మాత్రమే వాడాలని అధిక మోతాదులో వాడడం వలన పంట పొలాలకు చీడపీడల సమస్య అధికమవుతుందని తెలియజేశారు. పంటకు కావలసిన ఎరువులను ఒకేసారి కాకుండా మూడు దఫాలుగా వేసుకోవడం వల్ల అధిక ప్రయోజనం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ సిబ్బంది అక్షంతల బిక్షం,రైతులు, తదితరులు పాల్గొన్నారు.
Read also : మహిళా ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించిన సర్పంచ్ పాలకూరి రమాదేవి నరసింహ గౌడ్
Read also : తెలంగాణ డీజీపీతో పెన్ కౌంటర్ సీఎండీ మర్యాద పూర్వక భేటి





