
క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్:- మన తెలుగు ప్లేయర్ నితీష్ కుమార్ రెడ్డి ఇవాళ ఆస్ట్రేలియా తో జరగబోతున్నటువంటి తొలి ఉండే మ్యాచ్లో అరంగేట్రం చేశారు. భారత్ స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ చేతుల మీదుగా నితీష్ కుమార్ రెడ్డి క్యాప్ అందుకున్నారు. ఇప్పటివరకు నితీష్ కుమార్ రెడ్డి అంతర్జాతీయ టి20, టెస్టుల్లో అరంగేట్రం చేయగా తాజాగా వన్డే అరంగేట్రం కూడా చేయడంతో ఇప్పుడు ఆల్ ఫార్మేట్ ప్లేయర్ గా మన తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి అవతరించారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల క్రికెట్ ఫ్యాన్స్ అందరూ కూడా నితీష్ కుమార్ రెడ్డికి ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు. గతంలో టెస్టులో నితీష్ కుమార్ రెడ్డి ఆస్ట్రేలియా పై సెంచరీ చేసి రికార్డు సృష్టించారు. మళ్లీ వన్డేల్లో కూడా నేడు నితీష్ కుమార్ రెడ్డి మంచి ప్రదర్శన కనబరిస్తే ఇక అతను ఆల్ ఫార్మేట్ ప్లేయర్గా కచ్చితంగా జట్టులో చోటు సంపాదించుకునే అవకాశాలు ఉంటాయి. ఈరోజు ప్రారంభమైన మ్యాచ్లో… మొదటి బ్యాటింగ్కు దిగిన టీమిండియా మూడు వికెట్ కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అయితే గతంలో నవంబర్ 22వ తేదీన విరాట్ కోహ్లీ నుంచి టెస్ట్ క్యాప్ అందుకున్న నితీష్ కుమార్ రెడ్డి నేడు రోహిత్ శర్మ చేతుల మీదుగా క్యాప్ తీసుకున్నారు. ఈ రెండు సంఘటనలు నితీష్ కుమార్ రెడ్డి జీవితంలో మర్చిపోలేనటువంటి మూమెంట్స్ గా మిగిలిపోతాయని ప్రతి ఒక్కరు భావిస్తున్నారు. ఇప్పటికే నితీష్ తల్లిదండ్రులు కూడా ఇలాంటి గొప్ప గొప్ప అవకాశాలు రావడం పట్ల చాలా గౌరవంగా ఫీల్ అవుతున్నారు. మరి ఈరోజు జరగబోయే ఎటువంటి తొలి వన్డేల్లో నితీష్ కుమార్ రెడ్డి ఎలాంటి ప్రతిభను కనబరుస్తారో వేచి చూడాల్సిందే.
Read also : ఏపీలో అర్ధరాత్రి దంచికొట్టిన భారీ వర్షాలు..!
Read also : బిగ్ షాకింగ్ న్యూస్… ట్రంప్ కు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న అమెరికన్లు