
క్రైమ్ మిర్రర్, జాతీయ న్యూస్:- ఈ రోజుల్లో విద్యార్థులు ఏదో ఒక అంశంపై స్పష్టమైన నిర్ణయాలు తీసుకుని ఉంటారు. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక సన్నివేశం యావత్తు నెటిజనులందరినీ కూడా ఆశ్చర్యపోయేలా చేసింది. ఇంతకీ ఆ విషయం ఏంటంటే… ఒక మహిళా చిన్నారి క్యాన్సర్ తో పోరాడుతూ ఉంది. ఇక ఈ క్యాన్సర్ కు చికిత్సలో భాగంగా ఆ చిన్నారి తల్లిదండ్రులు గుండు చేయించారు. క్యాన్సర్ చికిత్సలో భాగంగా జుట్టు కోల్పోవడంతో ఆ చిన్నారి స్కూలుకు రావడానికి భయపడింది. ఎక్కడ తనను చూసి ఇతర విద్యార్థులు నవ్వుకుంటారో?.. లేక జాలి చూపిస్తారో?.. ఇకనుంచి నేను ఒంటరిని అని స్కూల్ కి వెళ్లడానికి చాలా భయపడింది. ఈ విషయం తెలుసుకున్న తోటి విద్యార్థులు అలాగే ఆ స్కూల్ టీచర్లు అందరూ కూడా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నారు.
క్యాన్సర్ చికిత్స పొందినటువంటి చిన్నారి తరగతి విద్యార్థులు అందరూ కూడా గుండు చేయించుకొని.. ” నువ్వు ఒంటరివి కాదు.. నీ పోరాటానికి తోడుగా మేమున్నాము”.. అని ఆ చిన్నారికి ధైర్యం చెప్పారు. దీంతో తోటి విద్యార్థులు చేసిన ఈ పనికి యావత్ ప్రపంచమంతా కూడా సలాం కొడుతోంది. కష్టాల్లో ఉన్నవారికి తోడుగా నిలబడాలని గొప్ప సందేశాన్ని ఇస్తోంది అని నెటిజనులు సైతం ఈ విషయాన్ని వైరల్ చేస్తున్నారు. ప్రేమకు అలాగే ఐక్యతకు ఇది ఒక నిదర్శనం అని కొనియాడుతున్నారు. ఈ రోజుల్లో ఇతర వ్యక్తులకు ఏదైనా నష్టం జరిగింది అంటే వారిని చూసి అయ్యో పాపం లేదా నవ్వుకోవడమో చేస్తూ ఉంటాం. కానీ ఇలాంటి సందర్భంలో ఈ విద్యార్థులు చేసిన పనికి ప్రతి ఒక్కరు కూడా హ్యాట్సాఫ్ అంటున్నారు.





