వైన్ షాప్ కారణంగా ప్రశాంతతకు భంగం.. ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేసిన మహిళలు

చిట్యాల,క్రైమ్ మిర్రర్:- చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని 09వ వార్డులో ఉన్న వైన్ షాప్ వల్ల స్థానిక ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఆ షాపుపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ మహిళలు నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ, వైన్ షాప్ కారణంగా ప్రశాంతత భంగం కలుగుతోందని, మహిళలు మరియు పిల్లలకు అసౌకర్యం ఏర్పడుతోందని తెలిపారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం సమస్యను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Read also : ప్రజావాణిలో పిర్యాదులు బుట్ట దాఖలు చేసిన వారి పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు

Read also : Viral Video: అంగన్వాడీలో కూతురిని చేర్చిన ఐఏఎస్, నెట్టింట వీడియో వైరల్!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button