
Love Affair : ఈ మధ్యకాలంలో కొందరు కోరికలు అదుపు చేసుకోలేక వాటికి ప్రేమ అనే పేరుతో విపరీతమైన కార్యాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో కట్టుకున్న భర్తలను దారుణంగా హతమార్చడం, తర్వాత ఆత్మహత్య లేదా నేచురల్ డెత్ అని నమ్మించడం చివరికి పోలీసులకు దొరికిపోవడం వంటివి జరుగుతున్నాయి. అయితే ఓ మహిళ పెళ్లయిన తర్వాత ప్రియుడి కోసం ఏకంగా కట్టుకున్న భర్తని కడతేర్చిన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలో వెలుగు చూసింది. పూర్తి వివరాల్లోకి వెళితే స్థానిక జిల్లాలోని గన్నవరం మండలం వెంకట నరసింహపురంలో లక్ష్మణ్, పావని అనే ఇద్దరు దంపతులు నివాసం ఉంటున్నారు. అయితే వీరిద్దరూ 15 సంవత్సరాల క్రితం ప్రేమించుకోగా, వీరి పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో ఎదిరించి మరీ పెళ్లి చేసుకున్నారు. దీంతో కొన్నాళ్లపాటు ఇరువురు బంధువులు మాట్లాడకపోవడంతో సపరేట్ గా ఉంటూ లైఫ్ లీడ్ చేస్తున్నారు.
ప్రస్తుతం వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే లక్ష్మణ్ తన భార్య పిల్లల్ని బాగా చూసుకోవడం కోసం కష్టపడి పనిచేస్తూ బాగానే సంపాదించేవాడు. కానీ పావని మాత్రం ఇంటిపట్టునే ఉంటూ కుటుంబ బాధ్యతలు చక్కపెట్టేది. అయితే ఈమధ్య పావనికి తన సందీప్ బంధువైన ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడింది. దీంతో తరుచుగా ఫోన్లో మాట్లాడటం, లక్ష్మణ్ ఇంట్లో లేనప్పుడు కలుసుకోవడం వంటివి చేసేది.
ఇది గమనించిన కొందరు లక్ష్మణ్ బంధువులు తన భార్య గురించి చెవిలో వేశారు. దీంతో లక్ష్మణ్ తన భార్యకి సర్ది చెప్పడం అలాగే పెళ్లయిన తర్వాత ఇలాంటివి మంచిది కాదని పిల్లల కోసం భార్య చేష్టలు భరిస్తూ వచ్చాడు. ఈ క్రమంలో ఒక్కోసారి పెద్ద గొడవలు జరిగేవి. అయితే పావని మాత్రం తన భర్త అడ్డు తొలగించుకుంటే ప్రియుడితో లైఫ్ ఎంజాయ్ చేయొచ్చని ఏకంగా ప్రియుడితో కలిసి లక్ష్మణ్ ని హతమార్చింది. ఆ తర్వాత బంధువులకు అనుమానం రాకుండా నేచురల్ డెత్ అని నమ్మిస్తూ లక్ష్మణ్ అంత్యక్రియలు జరిపించేసింది. కానీ పావని వ్యవహారం తెలిసిన కొందరు బంధువులు పోలీసులకు అక్రమ సంబంధం గురించి ఫిర్యాదు చేశారు. దీంతో పావని ను అదుపులోకి తీసుకొని విచరించగా అసలు విషయం బయటపడింది. ఇంకేముంది పావనితోపాటు తన ప్రియుడిని కూడా అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు.