క్రైమ్జాతీయం

5000 రూపాయలు ఇస్తేనే కాపురం చేస్తా అంటున్న భార్య!… ఇదెక్కడి విడ్డూరం..

క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- రోజురోజుకీ భార్యాభర్తల బంధాలు అనేవి ఒక వింత నాటకం ల మారిపోతున్నాయి. తాజాగా ప్రతిరోజు 5000 రూపాయలు ఇస్తే గాని నా భార్య నాతో కాపురం చేయనంటుందని బెంగళూరుకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి అయినటువంటి శ్రీకాంత్ పోలీసులను ఆశ్రయించిన సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇక అసలు విషయానికి వస్తే… ప్రతిరోజు కూడా 5000 రూపాయలు ఇస్తేనే నాతో కాపురం చేస్తా అని నా భార్య… నన్ను హింసిస్తుందని శ్రీకాంత్ అనే సాఫ్ట్వేర్ ఉద్యోగి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. WFH జూమ్ కాల్స్ మాట్లాడుతున్న సందర్భంలో నా భార్య నన్ను కొడుతుందని… అలాగే లాప్టాప్ ముందు డాన్స్ కూడా చేస్తుందని… దానివల్ల నా జాబు పోయిందని శ్రీకాంత్ అనే సాఫ్ట్వేర్ ఉద్యోగి పోలీసులకు తెలిపాడు.

ప్రతి పౌరుడు రోడ్డు ప్రమాదాల నివారణకై బాధ్యత వహించాలి..

60 సంవత్సరాలు వచ్చేవరకు పిల్లలు వద్దంటుందని ఆవేదన వ్యక్తం చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక చివరికి విడాకులు అడిగితే 45 లక్షలు డిమాండ్ చేస్తుందని శ్రీకాంత్ తెలిపారు. అయితే భర్త మాటలు విన్న పోలీసులు… తన భార్యకు ఒకసారి కాల్ చేసి మాట్లాడగా.. నా భర్త నన్ను మోసం చేసి, ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడని శ్రీకాంత్ భార్య ఆరోపిస్తుంది. దీంతో తికమకలో ఉన్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు. ఇలాంటి కొన్ని సంఘటనల వల్ల మన సమాజం ఎటు పోతుందో అని చాలా మంది భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. డబ్బులు ఇస్తేనే కాపురం చేసేది ఏంటని చాలామంది శ్రీకాంత్ భార్యను ట్రోల్ చేస్తున్నారు. ఏది ఏమైనా కూడా ఇలాంటి సంఘటనలు మన భారతదేశంలో ప్రతిరోజు ఏదో ఒక పట్టణంలో లేదా గ్రామంలో జరుగుతూనే ఉన్నాయి. నిజానికి ఆ రోజులే బాగుండేవి అని చాలామంది కామెంట్లు చేస్తున్నారు. ఇక భవిష్యత్తులో భార్యాభర్తల మధ్య ఎలాంటి వింత చేష్టలు జరుగుతాయో అని చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కాంగ్రెస్ బడ్జెట్ పై తీవ్రంగా ఫైర్ అయిన కేటీఆర్!.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button