తెలంగాణ

జర్నలిస్టుల సంక్షేమమే జెండా… ఎజెండా…!

క్రైమ్ మిర్రర్, నల్గొండ బ్యూరో :జర్నలిస్టుల సంక్షేమమే జెండా.. ఎజెండా అని
టీయూడబ్ల్యూజే ( ఐజేయూ ) రాష్ట్ర అధ్యక్షులు కే. విరహత్ అలీ అన్నారు. బుధవారం చండూరు మున్సిపల్ కేంద్రంలోని స్థానిక రాజశ్రీ బాంకెట్ హాల్లో జరిగిన ఐజేయూ జిల్లా కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిలా పని చేసే జర్నలిస్టులు నిత్యం ఒత్తిడి, సవాళ్లను ఎదర్కోవాల్సి ఉంటుందన్నారు. వారికి ఆరోగ్య రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. విలేకరుల ఇళ్ల స్థలాల విషయమై ప్రభుత్వానికి నివేదికలు అందించినట్లు తెలిపారు. భారతదేశంలో జర్నలిస్టుల సంక్షేమం కోసం 70 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఏకైక సంఘం టీయూడబ్ల్యూజే – ఐజేయూ అన్నారు. సంఘం ఆవిర్భవించిందే జర్నలిస్టుల సంక్షేమం కోసం అని, నాటి నుండి నేటి వరకు జర్నలిస్టులకు ఎన్నో సంక్షేమ ఫలాలు అందించడం కోసం రాజీలేని పోరాటాలు చేసిన చరిత్ర ఐజేయూ సంఘానిదే అన్నారు.

నేడు జర్నలిస్టులకు అందుతున్న అక్రిడిటేషన్, ఆరోగ్య భీమా, ఇండ్ల స్థలాలు మొదలైన సంక్షేమ ఫలాలు కేవలం టీయూడబ్ల్యూజే – ఐజేయూ పోరాటాల ఫలితమేనని ఆయన అన్నారు. ఇంకా పూర్తిగా జర్నలిస్టులకు, వారి కుటుంబాలకు యాజమాన్యాల నుండి రక్షణ లేకున్నా తమ సంఘం పోరాటాల ద్వారా జర్నలిస్టులను అన్ని విధాలుగా ఆదుకునే విధంగా రాష్ట్రవ్యాప్తంగా పోరాటాల కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలియజేశారు. తమ సంఘం ఇచ్చే పిలుపులో జర్నలిస్టులు అధిక సంఖ్యలో పాల్గొనాలని, అన్ని రకాల కమిటీలు బాధ్యతాయుతంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. అందుకు రాష్ట్ర సంఘం నుండి అన్నివేళలా పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని ఆయన తెలిపారు.

జిల్లా అధ్యక్షులు గార్లపాటి కృష్ణా రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. రాంనారాయణ,
జిల్లా ప్రధాన కార్యదర్శి కలిమల నాగయ్య, జిల్లా ఉపాధ్యక్షులు బొమ్మరబోయిన వెంకన్న, దోటి శ్రీనివాసులు, జిల్లా సహాయ కార్యదర్శి కేసాని శ్రీధర్ రెడ్డి, జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు యం. యాదగిరి, ప్రధాన కార్యదర్శి డి. శ్రీనివాస్ రెడ్డి, నల్లగొండ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి, వి చంద్రశేఖర్ రెడ్డి, వి. వెంకట్ రెడ్డి, ఎలక్ట్రానిక్ మీడియా నియోజకవర్గ అధ్యక్షులు ఎరుకల వంశీ, రాపోలు ప్రభాకర్, సంగెపు మల్లికార్జున్, నల్ల స్వామి, ఆడెపు శంకర్, సంగెపు మల్లేష్, రవీంద్ర చారి, ఆకుల రఘుమయ్య, ముత్యాలు, ముడుపు శ్యామ్ రెడ్డి, మహేశ్వరం సతీష్, వెంకన్న, నక్క శ్రీనివాస్, ఇడెం గణేష్, జక్కల నాగరాజు, దోటి లింగస్వామి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button