’మోడీజి `ఎల్‌పిజి’ అంటూ ప్రతిపక్షాల ఆందోళన
రోడ్డుపైనే వంటావార్పు చేసి నిరసన
న్యూఢిల్లీ, క్రైమ్ మిర్రర్: గ్యాస్ కొరతతో యుద్దం సెగలు ఢిల్లీకి అంటుకున్నాయి. ’మోడీజి `ఎల్‌పిజి’ అంటూ ప్రతిపక్షాలు గురువారం పార్లమెంటు ఎదుట ఆందోళన చేపట్టారు. కమరిషయల్ ఎల్‌పిజి సిలిండర్ల కొరతపై మోడీ ప్రభుత్వం సమాధానమివ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్, డిఎంకె, టిఎంసి, ఎసి సహా పలువురు ఎంపిలు మకరద్వారం ఎదుట ఆందోళన చేపట్టారు. ’నామ్ నరేందర్, కామ్ సరెండర్’, ’మోడీజి, ఎల్‌పిజి’ అంటూ నినాదాలు చేశారు.
ప్రియాంక వాధ్రా గాంధీ సహా పలువురు మహిళా ఎంపిలు ఇటుకల పొయ్యిలను ప్రదర్శించారు. ప్రధాని మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేపట్టారు. పశ్చిమాసియా పరిస్థితులు, భారత్‌పై దాని ప్రభావంపై పూర్తి స్థాయిలో చర్చ జరపాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ఈ సందర్భంగా లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ ప్రధాని మోడీపై విరుచుకుపడ్డారు.
ఎల్‌పిజి కొరతపై ప్రజలు ఆందోళన చెందవద్దని ప్రధాని పేర్కొన్నారని, కానీ ’పూర్తి భిన్నమైన కారణాల’తో ఆయన తీవ్ర ఆందోళన చెందుతున్నారని ఎద్దేవా చేశారు. ఎస్టీపిన్ ఫైల్స్, అదానీ కేసులపై ప్రధాని ఆందోళనకు గురవుతున్నారని అన్నారు. పార్లమెంటుకు వచ్చేందుకు కూడా మోడీ భయపడుతున్నారని, బుధవారం పార్లమెంటులో ఆయన కుర్చీ ఖాళీగా ఉండటం అందరం చూశామని అన్నారు.
ప్రజలకు ఆందోళన చెందవద్దని చెబుతున్నారని, కానీ ఆయన ఆందోళనకు గురువుతన్నారన్నది స్పష్టమౌతోందని అన్నారు. గ్యాస్‌పై అబద్దాలాడుతున్న మోదీ సర్కారుగ్యాస్ కొరత విషయంలో కేంద్రం తీరుపై కాంగ్రెస్ మండిపడింది. వాస్తవాన్ని ప్రజలకు చెప్పకుండా మోదీ సర్కారు అబద్ధమాడుతోందని కాంగ్రెస్ నాయకులు దుయ్యబట్టారు. ఎల్‌పీజీ కొరతపై సభలో చర్చకు డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ సభ్యులు పార్లమెంటు ముందు నిరసన ప్రదర్శన నిర్వహించారు.
