క్రీడలు

దారుణంగా పడిపోతున్న ఐపీఎల్ విలువ.. కారణమేంటంటే?

క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్ :- ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ లీగ్ ఏదైనా ఉందంటే అది ఇండియన్ ప్రీమియర్ లీగ్ ( ఐపీఎల్). ఐపీఎల్ గురించి మన ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎందుకంటే.. ఐపీఎల్ అనేది ప్రతి ఏడాది ఎండాకాలంలో చాలా ఘనంగా జరుగుతుంటుంది. కేవలం ఐపిఎల్ ద్వారా బీసీసీఐకు కొన్ని వేల కోట్ల ఆదాయం వస్తుంది. ఒకవైపు ఆదాయం పరంగాను మరోవైపు కొత్త కొత్త ఆటగాళ్లు కూడా ఈ లీగ్ ద్వారానే పుట్టుకొస్తున్నారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఐపీఎల్ పేరు మార్మోగుతూ ఉంటుంది. ప్రతి ఏడాది వివిధ దేశాల నుంచి ప్లేయర్స్ యాక్షన్ లో కొనుగోలు చేస్తూ ఉంటారు. ఈ ఐపీఎల్ లీగ్ లో దాదాపు 8 జట్టులు ఉన్నాయి.

1. సన్రైజర్స్ హైదరాబాద్
2. చెన్నై సూపర్ కింగ్స్
3. ముంబై ఇండియన్స్
4. రాజస్థాన్ రాయల్స్
5. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
6. పంజాబ్ కింగ్స్
7. ఢిల్లీ క్యాపిటల్స్
8. కోల్కత్తా నైట్ రైడర్స్

ఐపీఎల్ లోని ఎనిమిది జట్ల ద్వారా ప్రతి ఏడాది కూడా ఐపీఎల్ కు భారీ ఆదాయం లభిస్తుంది. కానీ ఈసారి మాత్రం ఐపీఎల్ విలువ వరుసగా రెండోసారి దారుణంగా పడిపోయింది. 2023లో ఐపీఎల్ వాల్యూ 93,500 కోట్లు ఉండగా 2024 సీజన్ నాటికి అది 82,700కు తగ్గింది. ఇక 2025లో మరో 6600 కోట్ల రూపాయలు తగ్గి ప్రస్తుతం 76,100 కోట్లకు పడిపోయింది. గత ఏడాదితో పోలిస్తే ఏకంగా 8% వరకు కిందకు పడిపోయింది. దీనికి కారణం ఏంటంటే… స్పాన్సర్స్ గా ఉన్నటువంటి బెట్టింగ్ యాప్స్ బ్యాన్ అవడం మొదటి కారణం. మరోవైపు TVని డిజిటల్ మీడియా ఓవర్టేక్ చేస్తుండడం రెండవ కారణంగా చెప్పవచ్చు. వీటి కారణంగానే ప్రతి ఏడాది కూడా IPL వ్యాల్యూ తగ్గుతూ వస్తుంది. మరి రాబోయే రెండు మూడు ఏళ్లలోపు ఈ వ్యాల్యూ ఎలా ఉండబోతుంది అనేది ఎవరికి కూడా అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. కానీ ఈ ఐపీఎల్ ద్వారా బీసీసీఐకి బోలెడు ఆదాయం లభిస్తుంది. ఈ డబ్బు అంతటినీ కూడా మన దేశంలో ఉన్నటువంటి వివిధ క్రికెట్ స్టేడియాల అభివృద్ధికి అలాగే మరి కొన్ని వసతి సదుపాయాలకు వినియోగించనున్నారు.

Read also : ఆయన కడుపున పుట్టడం జన్మజన్మల అదృష్టం.. కానీ ఆ విషయంలో మాత్రం..?

Read also : చిన్నపిల్లల భద్రత కోసం.. ‘Instagram’ సరికొత్త రూల్స్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button