Monday, March 23, 2026
Homeతెలంగాణనిరుద్యోగుల ఉసురు ప్రభుత్వానికి తగలడం ఖాయం : కేటీఆర్

నిరుద్యోగుల ఉసురు ప్రభుత్వానికి తగలడం ఖాయం : కేటీఆర్

క్రైమ్ మిర్రర్,తెలంగాణ:- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధికార కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి కొన్ని హామీల విషయాల పై కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ పార్టీ హామీలలో భాగంగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే ఈ విషయంపై తాజాగా కేటీఆర్ మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఇచ్చిన హామీ నెరవేర్చకుండా సీఎం రేవంత్ రెడ్డి ముఖం చాటేశారు అని ఫైరయ్యారు. అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న కూడా ఇంకా రెండు లక్షల ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారు అని ప్రశ్నించారు. నిరుద్యోగుల ఉసురు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తగలడం ఖాయమని కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మరోవైపు రైతు బంధు గురించి మాట్లాడుతూ మూడు దఫాలుగా ఎగ్గొట్టి 70 లక్షల మంది అన్నదాతల పొట్ట కొట్టారు అని కాంగ్రెస్ ప్రభుత్వం పై తీవ్రంగా మండిపడ్డారు. ఇంకోవైపు మహిళలకు 2500 ఇస్తామని చెప్పిన మాట కూడా గాలికి వెళ్ళిపోయింది దుయ్యబట్టారు. అధికారంలోకి రావడానికి హామీలన్నీ ఇస్తామని చెప్పి ఇప్పుడు మాట తిప్పేశారు అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు ఎలా ఉందో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క మనిషి చూస్తున్నారు అని అన్నారు. ఇకనుంచైనా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చుకోండి అని.. లేదంటే రాబోయే ఎన్నికలలో కచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి షాక్ తగులుతుంది అని సూచించారు.

Read also : గోన సంచిలో గుర్తు తెలియ‌ని మృతదేహం

Read also : ఇంత నీచమైన రాజకీయాలు చూడలేదు.. డిప్యూటీ సీఎంకు ఇదే నా ప్రశ్న : అంబటి కూతురు

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది.పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments