Wednesday, March 25, 2026
Homeసినిమాసినీ ఇండస్ట్రీలో ట్రెండ్ మారింది.. తెరమీద తండ్రీ కూతుర్ల హవా?

సినీ ఇండస్ట్రీలో ట్రెండ్ మారింది.. తెరమీద తండ్రీ కూతుర్ల హవా?

క్రైమ్ మిర్రర్, సినిమా న్యూస్:- ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో తండ్రీ కొడుకుల కాంబోలు ఎన్నో సందర్భాలలో చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు చిరంజీవి, సూపర్ స్టార్ కృష్ణ, నందమూరి తారక రామారావు, హరికృష్ణ వంటి ఎంతోమంది హీరోలు తమ కొడుకులను ఇంట్రడ్యూస్ చేస్తూ వారి కాంబోలను వివిధ స్టేజీలపై లేదా వివిధ సందర్భాలలో కలిసి ప్రసంగాలు చేస్తూ ఉండడం చూశాం. అయితే 2026వ నూతన సంవత్సరము నుంచి ఈ ట్రెండింగ్ అనేది పూర్తిగా మారిపోయింది. సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు తండ్రి కొడుకులు కాంబోలు చూసాం కానీ ఇప్పుడు పూర్తిగా తండ్రి కూతుర్ల జోరు చూస్తున్నాం. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మెగాస్టార్ చిరంజీవి తన కుమార్తె సుస్మిత “మన శంకర్ వరప్రసాద్ గారు” సినిమాతో నిర్మాతగా సత్తా చాటుతూ కొనసాగుతుంది. గుణశేఖర్ కుమార్తె నీలిమ “యుఫోరియా” సినిమాను తాజాగా నిర్మించారు. ఇంకో వైపు రవితేజ కూతురు మోక్షదా తన తండ్రి “ఇరుముడి” సినిమా నిర్మాణ బాధ్యతలను చేపట్టారు. ఇక సూపర్ హీరో అర్జున్ తన కుమార్తె ఐశ్వర్య హీరోయిన్గా “సీత పయనం” అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ తండ్రి కూతుర్ల కాంబోలు వివిధ కార్యక్రమాల్లో కలిసి మెలిసి ప్రసంగాలు చేయడం చాలా వైరల్ గా మారింది.

ALSO READ

డబుల్ సిసి రోడ్డు పనులు ప్రారంభించిన గ్రామ సర్పంచ్ బీసు ధనలక్ష్మి చందర్ గౌడ్

మ‌హా శివ‌రాత్రి మ‌హోత్స‌వానికి సీఎం చంద్ర‌బాబుకు ఆహ్వానం

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది.పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments