
క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- తెలంగాణ రాష్ట్రంలోనూ వర్షపు ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ అధికారులు తాజాగా స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు మూడు రోజులపాటు ఉరుములు, మెరుపులు మరియు ఈదురు గాలులతో కూడినటువంటి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజాగా వెల్లడించింది. నేటి నుంచి ఈ
మూడు రోజులపాటు ఈ జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు.
వర్ష ప్రభావిత జిల్లాలు
1. ఖమ్మం
2. కొత్తగూడెం
3. నల్గొండ
4. సూర్యపేట
5. మహబూబాబాద్
6. వరంగల్
7. హనుమకొండ
8. జనగాం
9. సిద్దిపేట
10. యాదాద్రి
11. హైదరాబాద్
12. మేడ్చల్
13. వికారాబాద్
14. రంగారెడ్డి
15. మెదక్
16. కామారెడ్డి
17. ఉమ్మడి మహబూబ్ నగర్
పైన పేర్కొన్న ఈ 17 జిల్లాలలో రాబోయే మూడు రోజులు పాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు. ఇక మిగతా అన్ని జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ వర్షాలు నేపథ్యంలో తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. వాహనదారులు ఎవరూ కూడా అతివేగంతో ప్రయాణాలు చేయవద్దని హెచ్చరించారు. లోతట్టు ప్రాంత ప్రజలపై ఎప్పటికప్పుడు అధికారులు నిఘా ఉంచుతామని.. ఏవైనా అత్యవసర పరిస్థితులు ఏర్పడితే వెంటనే హెల్ప్ లైన్ నెంబర్లకు కాల్ చేయాలని కోరారు.
Read also : మూడవ వన్డేలో మన తెలుగు ప్లేయర్ దూరం అవ్వడానికి కారణం ఇదే!
Read also : వడ్లు కొనుగోలు లేదు… రోడ్డు ఎక్కిన రైతన్నలు





