
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వర్షపు ముప్పు పొంచి ఉంది అని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి తీవ్ర అల్పపీడనం తుఫానుగా మారేటువంటి అవకాశాలు ఉన్నాయని APSDMA అధికారులు స్పష్టం చేశారు. ఈ అల్పపీడనం కారణంగా రాబోయే మరో 3 రోజులపాటు తీవ్రమైన ఈదురు గాలులతో పాటు భారీ వర్షాలు దంచి కొడతాయని వెల్లడించారు.
ఇవాళ,రేపు వర్ష ప్రభావిత జిల్లాలు
1. కోనసీమ
2. కృష్ణ
3. బాపట్ల
4. ప్రకాశం
5. నెల్లూరు
6. తిరుపతి
పైన పేర్కొన్న ఈ ఆరు జిల్లాలలో ఇవాళ మరియు రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. మరోవైపు ఈనెల 28 లేదా 29వ తేదీలో అల్పపీడనం తుఫానుగా మారి… రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు దంచి కొడతాయని అన్నారు. కాబట్టి ఈ వారం రోజులు పాటు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్ళవద్దని… వాహనదారులు కూడా తమ ప్రయాణాలను రద్దు చేసుకోవాలని కోరారు. తుఫాన్ ప్రభావంతో అక్కడక్కడ లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం… వ్యవసాయ పంటలు కూడా దెబ్బ తినే అవకాశాలు ఉన్నాయని… ఏమైనా అత్యవసర పరిస్థితులు ఏర్పడితే వెంటనే హెల్ప్ లైన్ నెంబర్లకు ఫోన్ చేయాలని కోరారు.
Read also : ముగిసిన దుబాయ్ పర్యటన.. ఏపీకి తిరిగి వస్తున్న సీఎం!
Read also : బస్సు దగ్ధం కేసులో వెలుగులోకి వచ్చిన మరో సంచలన విషయం?





