
క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్:- భారత్ మరియు ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లలో ఇప్పటికే రెండు మ్యాచ్లు ఓడిపోయి ఇండియా కష్టాల్లో ఉంది. అదికాక ఇప్పుడు రేపు జరగబోయేటువంటి నాలుగో టెస్ట్ మ్యాచ్లో కీలక ప్లేయర్లు గాయం కారణంగా రాబోయే రెండు టెస్ట్ మ్యాచ్లకు దూరమయ్యారు. ఇందులో ముఖ్యంగా అర్షదీప్ సింగ్ మరియు నితీష్ కుమార్ రెడ్డి మరియు ఆకాశదీప్ దూరమయ్యారు. దీంతో ఇండియా బౌలింగ్ విషయంలో చాలా వెనకబడి ఉంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇంతటి బాడ్ న్యూస్ లో కూడా మరొక శుభవార్త ఉంది. అదేంటంటే 4వ టెస్టు మ్యాచ్లో బుమ్రా ఆడుతారని బౌలర్ మహమ్మద్ సిరాజ్ కన్ఫర్మ్ చేశారు. మొదటగా బుమ్రా కు విశ్రాంతి కారణంగా నాలుగో టెస్ట్ మ్యాచ్లో ఆడొచ్చో లేదో అనే సందేహాలు నెలకొన్నాయి. కానీ బుమ్రా కచ్చితంగా నాలుగో టెస్ట్ మ్యాచులో ఆడుతారని మహమ్మద్ సిరాజ్ చెప్పిన వెంటనే ఇండియన్ ఫ్యాన్స్ కాస్త కుదుటపడ్డారు. కాగా ఇప్పటివరకు టెస్ట్ మ్యాచ్ లో ఆకాష్ డీప్ అలాగే నితీష్ కుమార్ రెడ్డి చాలా అద్భుతంగా బౌలింగ్ చేశారు. ముఖ్యంగా బుమ్రా లేని సమయంలో ఆకాశదీప్ అలాగే నితీష్ కుమార్ రెడ్డి ఇద్దరు కూడా బౌలింగ్ లైనప్ లో మహమ్మద్ సిరాజ్కు తోడై ఇండియాని కష్టాల్లో నుంచి గట్టెక్కించారు. మరి తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి అలాగే కీలకమైన బౌలర్స్ ఆకాష్ దీప్ మరియు హర్షదీప్ సింగ్ ముగ్గురు కూడా గాయాల కారణంగా ఈ టోర్నీ నుంచి వైదొలిగారు. మరి వీరి స్థానంలో ఎవరు వస్తారు అనేది ఆసక్తిగా మారింది.
ఆంధ్రాలో మహిళలకు ఫ్రీ బస్సు పై సీఎం కీలక ఆదేశాలు!
కాంగ్రెస్ కార్యాలయాల్లా పోలీస్‌స్టేషన్లు!… ఆర్మూర్ పీఎస్‌లో హస్తం పార్టీ నేతల ప్రెస్‌మీట్