
క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేడు అన్ని ప్రైవేట్ కాలేజీలు మూసివేసి బంద్ చేపడుతున్నట్లు ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాల సంఘం వెల్లడించింది. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడానికి నిరసిస్తూ ఈ బంద్ చేపట్టాము అని తెలిపింది. నవంబర్ 3వ తేదీన ఇంతకుముందే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోతే బంద్ ను చేపడతామని చెప్పినటువంటి ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్య సంఘము.. చెప్పిన విధంగానే ఈరోజు బంద్ నిర్వహిస్తున్నారు. డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ మరియు బిఈడి కాలేజీలను మూసివేస్తున్నామని ఈ FATHI వెల్లడించింది. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లిస్తే గాని కాలేజీలు తెరవబోము అని మరోసారి హెచ్చరించారు. ఈ విషయంపై ప్రభుత్వం కానీ స్పందించకపోతే ఈ నెల 6వ తేదీన హైదరాబాదులో కొన్ని వేల మంది సిబ్బందితో సభలను కూడా ఏర్పాటు చేస్తామని పిలుపునిచ్చారు. దీంతో ఈ బంద్అనేది కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందిగా మారింది. వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లిస్తే గాని ఈ ప్రైవేట్ విద్య సమస్యల యాజమాన్య సంఘాలు బంద్ ను విరమించుకునే పరిస్థితులు కనబడడం లేదు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఈ విషయం కాస్త ఉత్కంఠంగా మారింది. మరి వీటిని ప్రతిపక్ష పార్టీలు ఎలా ఉపయోగించుకుంటాయో వేచి చూడాల్సిందే.
Read also : టీమిండియా పై ప్రశంశల వెల్లువ..!
Read also : జగన్ కు ప్రతిదీ రాజకీయమే.. మరోసారి రుజువు చేశారు : టీడీపీ





