
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో తొలిసారి ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తమ ప్రభుత్వానికి తిరుగులేని మెజారిటీ ఇచ్చారని… ప్రజల కోరిక మేరకు కూటమి ప్రభుత్వం ఏర్పాటైందన్నారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం అనేక ఇబ్బందులు పడిందని.. ఎంతో నష్టపోయిందని అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత… స్వర్ణాంధ్ర దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. 2047నాటికి స్వర్ణాంధ్ర కల సాకారం అయ్యేలా ఒక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చాక… రాష్ట్ర తలసరి ఆదాయం పెరిగిందన్నారు.
అభివృద్ధితోపాటు ప్రజలకు సంక్షేమాన్ని కూడా అందిస్తున్నామన్నారు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్. సూపర్ సిక్స్ పథకాలతో ప్రజలకు మేలు చేస్తున్నామని చెప్పారు. అన్నా క్యాంటీన్ల ద్వారా పేదల ఆకలి తీర్చడమే కాకుండా… పెన్షన్లను 4వేల రూపాయలకు పెంచామన్నారు. అంతేకుండా… ప్రతినెల ఒకటవ తేదీనే ఇంటింటికీ వెళ్లి పింఛన్లు పంపిణీ చేస్తున్నామన్నారు. ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నామని చెప్పారు. అలాగే… కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను రద్దు చేశామని అన్నారు. గత ఐదేళ్లలో ఆగిపోయిన పోలవరం ప్రాజెక్టు పనులను మళ్లీ పట్టాలెక్కించామన్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ కూడా ఆగిపోయిందని చెప్పారు గవర్నర్. ఐటీ నుంచి ఐఏ రెవల్యూషన్ దిశగా… ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తుందన్నారు.
రాష్ట్రానికి పెట్టుబడులు కూడా పెరిగాయని చెప్పారు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్. 6.5 లక్షల కోట్ల పెట్టబడులు సాధించామని ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించారు. విద్య, వైద్య రంగాల్లో మౌలిక వసతులపై స్పెషల్ ఫోకస్ పెట్టామన్నారు. బీసీ సామాజిక వర్గం కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టబోతున్నామని తెలిపారు. నామినేటెడ్ పోస్టులు, స్థానిక సంస్థల్లో బీసీ వర్గాల వారికి 34 శాతం రిజర్వేషన్లు ఇస్తున్నట్టు గుర్తుచేశారాయన. 2029లోగా ప్రతి పేద కుటుంబానికి ఇల్లు ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. పీఎం సూర్య ఘర్ పథకం కింద.. సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేస్తున్నామని కూడా చెప్పారు. వ్యవసాయ, పారిశ్రామిక వృద్ధికి కూడా మరింత కృషిచేస్తున్నామని చెప్పారు.
ఇవి కూడా చదవండి..
-
రంగములోకి దిగిన రాట్ హోల్ మైనర్స్… ప్రతి ఒక్కరిలోనూ ఉత్కంఠత?
-
పార్టీ మారిన ఎమ్మెల్యేలపై స్పీకర్ చర్యలు తీసుకోవాల్సిందే… మాజీ మంత్రి కేటీఆర్
-
50 గంటలైనా కనిపించని జాడ.. 8 మంది కార్మికులు టన్నెల్ సమాధే?
-
రోజులు గడుస్తున్నాయ్…ఆశలు సన్నగిల్లుతున్నాయ్…ఆ 8మంది జాడేది..?
-
పార్టీ మారిన ఎమ్మెల్యేలపై స్పీకర్ చర్యలు తీసుకోవాల్సిందే… మాజీ మంత్రి కేటీఆర్