రాయ్ పూర్, క్రైమ్ మిర్రర్: చత్తీష్గడ్లో మావోయిస్టులతో కలిసి ఎస్సై భోజనం చేసిన అరుదైన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. చత్తీష్గడ్లోని కాంకేర్ జిల్లాలో ఆదివారం మావోయిస్టులు లొంగిపోయి జనజీవన స్రవంతిలోకి కలిసేందుకు వస్తున్నారనే సమాచారంతో పార్తాపూర్ ఎస్సై రామేశ్వర్ చతుర్వేది స్వయంగా అడవులకు వెళ్లి వారిని కలిశారు. దండకారణ్యంలో ఆహారం లేదని తెలుసుకొని కాలినడకన వస్తున్నట్లు తెలుసుకొని వారికి భోజన ఏర్పా్ట్లు చేసి వారితో కలిసి అడవిలో భోజనం చేశారు. కాగా పార్తాపూర్ ఏరియా కమిటీకి చెందిన రాధిక కుంజం, సందీప్ కడియం, రైను పద్మ తమ ఆయుధాలతో లొంగిపోయారు.
